మళ్లీ శ్రియ ఐటమ్ నంబర్..

Published : May 04, 2017, 01:57 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
మళ్లీ శ్రియ ఐటమ్ నంబర్..

సారాంశం

కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నక్షత్రం మూవీ నక్షత్రం మూవీలో స్పెషల్ సాంగ్ ఐటమ్ నంబర్  చేసేందుకు శ్రియ అంగీకారం తెలిపినట్లు సమాచారం

దశాబ్ద కాలానికి పైగా తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగుతోంది శ్రియ. గౌతమి పుత్ర శాతకర్ణికి ముందు ఇక శ్రియ పని అయిపోయిందని అంతా అనుకుంటుండగానే...బాలయ్య సరసన వాశిష్టిదేవిగా నటించి ప్రశంసలు అందుకుంది. అయితే శ్రియకు స్పెషల్ సాంగ్స్ లో చేయడం కూడా అలవాటు. తాను స్టెప్పులేసిన ఐటమ్ సాంగ్స్ ఆకట్టుకున్నాయి కూడా. ఇప్పుడు మరోసారి అదేబాటలో పయనిస్తోంది శ్రియ. 

 

ఈ మధ్య కాలంలో శ్రియ తనకి వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఒక వైపున సీనియర్ హీరోల సరసన కథానాయికగా నటిస్తూనే, మరో వైపున స్పెషల్ సాంగ్స్ చేయడానికి కూడా ఆమె అంగీకరిస్తోంది. తాజాగా కృష్ణవంశీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు.


కృష్ణవంశీ దర్శకత్వంలో 'నక్షత్రం' సినిమా రూపొందుతోంది. స్పెషల్ సాంగ్ మినహా మిగతా చిత్రీకరణను పూర్తిచేశారు. స్పెషల్ సాంగ్ కోసం కాజల్ ను సంప్రదిస్తున్నట్టుగా .. సన్నీలియోన్ ను అడుగుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఫైనల్ గా స్పెషల్ సాంగ్ కోసం శ్రియ ఎంపిక ఖరారైందని అంటున్నారు. గతంలో శ్రియ 'దేవదాసు' .. 'తులసి' .. 'మున్నా' సినిమాల్లో స్పెషల్ సాంగ్ చేసింది.

PREV
click me!

Recommended Stories

850 కోట్లతో యానిమల్‌ కు షాక్ ఇచ్చిన ధురందర్, ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం
1300 కోట్లతో బాక్సాఫీస్ క్వీన్ గా నిలిచిన హీరోయిన్ ఎవరు? 2025 లో టాప్ 5 స్టార్స్ కలెక్షన్లు