ఆ ప్రైజ్ మనీని శివబాలాజీ ఎం చేశాడో తెలుసా?

First Published Oct 3, 2017, 5:32 PM IST
Highlights
  • బిగ్ బాస్ షోకి విజేతగా నిలిచిన శివబాలాజీ
  • రూ.50లక్షలు ప్రైజ్ మనీ గెలుచుకున్న శివబాలాజీ
  • ఆ మనీని అనాథ ఆశ్రమానికి డొనేట్ చేసిన శివబాలాజీ

టాలీవుడ్‌లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా శివ బాలాజీ ఎన్నో ఏళ్లుగా ఉన్నారు. కానీ సినిమాల్లో కన్నా ఎక్కువగా ఆయనకు బిగ్‌బాస్ రియాలిటీ షోతో పేరు వచ్చింది. ఈ షో  కారణంగా మంచి పేరుతో పాటు రెమ్యురేషన్, ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నారు. అయితే తనకు లభించిన ప్రైజ్ మనీని శివ బాలాజీ ఏమీ చేశాడన్నది ప్రస్తుతం మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

 

బుల్లి తెర ప్రేక్ష‌కుల‌ని 70 రోజుల పాటు అలరించిన బిగ్ బాస్ రియాలిటీ షోలో శివ‌బాలాజీ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. విజేతగా నిలిచినిందుకు ఆయనకు రూ.50లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. అందులో పన్నులు పోను ఆయనకు రూ.35లక్షలు చేతికి అందినట్లు సమాచారం. దీంతోపాటు 70 రోజులు హౌస్ లో ఉన్నందుకు మరో 60లక్షలు ఆయనకు బిగ్ బాస్ అందజేసిందట.

 

బిగ్‌బాస్ హౌస్‌లో సెలబ్రిటీలు ఉంటున్న సమయంలో ప్రైజ్ మనీ వస్తే ఏం చేస్తారు అనే ప్రశ్నకు శివబాలాజీ..నిజంగా గెలిస్తే.. వేదికమీదే చెప్తాను అని మాటదాటేశాడు. కానీ శివ బాలాజీ విజేతగా నిలిచిన ఆనందంలో  వేదికపై ఆ విషయాన్ని చెప్పడం మర్చిపోయాడు. కానీ.. ఆచరించడం మాత్రం మరిచిపోలేదు. ఇప్పుడు.. శివబాలాజీ ఆ మనీని ఏం చేశారో.. ఆయన మిత్రుల ద్వారా బయటకు వచ్చింది. బిగ్ బాస్ షో ద్వారా త‌న‌కు లభించిన ప్రైజ్ మ‌నీని శివ బాలాజీ అనాథ పిల్ల‌ల‌ ఆశ్రమానికి విరాళంగా ఇచ్చినట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ.. శివబాలాజి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 

click me!