‘అర్జున్ రెడ్డి’ ని మిస్ అయ్యానంటున్న శర్వానంద్

Published : Oct 03, 2017, 05:07 PM ISTUpdated : Mar 26, 2018, 12:04 AM IST
‘అర్జున్ రెడ్డి’ ని మిస్ అయ్యానంటున్న శర్వానంద్

సారాంశం

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘ అర్జున్ రెడ్డి’ భారీ విజయం సొంతం చేసుకున్న అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డిలో నటించే అవకాశాన్ని వదులుకున్న శర్వానంద్

విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంటగా నటించిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’. ఇటీవల విడుదలైన ఈ సినిమా భారీ విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కేవలం రూ.4కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ.40కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తప్ప మరెవరూ నటించలేరు అన్నంతగా నటించి మెప్పించాడు. అయితే.. ఈ సినిమా కథ మొదట శర్వానంద్ దగ్గరకు వెళ్లిందట.  

 

సందీప్ వంగ ఈ సినిమాను ముందు శర్వానంద్ కే వినిపించాడట. కథ నచ్చి అశ్వనిదత్, లగడపాటి శ్రీధర్ లాంటి వారికి వినిపిస్తే.. వారు నిర్మాతలుగా వ్యవహరించేందుకు ఆసక్తి చూపలేదట. దీంతో సినిమాను సందీప్ వంగనే తన సొంతంగా నిర్మించాడు.  నిర్మాతలు ఓకే అంటే కచ్చితంగా ఆ సినిమా తానే తీసి ఉండేవాడినని,  అలా అర్జున్ రెడ్డిని మిస్ అయ్యానని అంటున్నాడు శర్వానంద్.

 

అర్జున్ రెడ్డి శర్వానంద్ చేస్తే ఎలా ఉండేదో తెలియదు కాని విజయ్ దేవరకొండ మాత్రం అదరగొట్టాడు. సినిమాతో తన సత్తా చాటిన విజయ్ ఈ దెబ్బతో స్టార్ హీరో అయ్యాడని చెప్పొచ్చు. అర్జున్ రెడ్డి  సినిమా ఈ రేంజ్ హిట్ అవుతుందని శర్వానంద్ కు  ముందే తెలిస్తే... వదులుకునేవాడు కాదేమో అందుకే తన తదుపరి చిత్రమైనా సందీప్ వంగతో చేయాలని ప్రణాళికలు చేస్తున్నాడట శర్వానంద్

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ డిసెంబర్ 16 బాలుని సవతి తల్లిలా చూశాను... ప్రభావతిలో మొదలైన పశ్ఛాత్తాపం
Regina Cassandra: ముస్లింగా పుట్టి క్రిస్టియన్ పేరు ఎందుకు పెట్టుకుందో చెప్పేసిన రెజీనా