Sharwanand: సక్సెస్ కోసం శర్వానంద్ విశ్వ ప్రయత్నం.. కుర్ర హీరో ఈసారైనా గట్టెక్కుతాడా..?

Published : Dec 28, 2021, 01:36 PM IST
Sharwanand: సక్సెస్ కోసం  శర్వానంద్ విశ్వ ప్రయత్నం.. కుర్ర హీరో ఈసారైనా గట్టెక్కుతాడా..?

సారాంశం

టాలీవుడ్ యంగ్ స్టార్ శర్వానంద్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. వరుస సినిమాలు చేస్తున్నా.. సక్సెస్ రేటు మాత్రం లేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నాడు. నెక్ట్స్ మూవీ నుంచి టీజర్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు యంగ్ హీరో.  

టాలీవుడ్ యంగ్ స్టార్ శర్వానంద్(Sharwanand) సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. వరుస సినిమాలు చేస్తున్నా.. సక్సెస్ రేటు మాత్రం లేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నాడు. నెక్ట్స్ మూవీ నుంచి టీజర్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు యంగ్ హీరో.  

 

పాపం శర్వానంద్ సక్సెస్ టేస్ట్ చూసి చాలా కాలం అవుతుంది. ఒక రకంగా శర్వానంద్ (Sharwanand) కు మారుతి డైరెక్షన్ లో వచ్చిన  మహానుభావుడు సినిమా తరువాత హిట్ లేదు. వరుసగా సినిమాలయితే చేసుకుంటూ పోతున్నాడు కాని.. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. సక్సెస్ మాత్రం వరిచడం లేదు. ఎన్నో ఆశలతో..మహాసముద్రం మూవీ చేశాడు శర్వా.. కాని రీసెంట్ గా రిలీజ్ అయిన ఈమూవీ కూడా డిజాస్టర్ అవ్వడంతో బాగా డిస్ట్రబ్  అయ్యాడు.

 

సక్సెస్.. ఫెయిల్యూర్ అని లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు Sharwanand. ఏదో ఓక సారి.. ఒకే ఒక్క సూపర సక్సెస్ తగిలితే చాలు.. ఇక కెరిర్ ను పరిగెట్టించవచ్చు అని ఫిక్స్ అయ్యాడు. అందుకే మంచి సినిమాలు సెలక్ట్ చేసుకుంటూ.. నాన్ స్టాప్ గా దూసుకుపోతున్నాడు. శర్వానంద్ నటించిన  “ఒకే ఒక్క జీవితం” మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈమూవీ నుంచి స్పెషల్ టీజర్ ను రేపు(డిసెంబర్ 29) సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు టీమ్.

శ్రీకార్తీక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శర్వానంద్ సరసన హీరోయిన్ గా తెలుగు హీరోయిన్  రీతూ వర్మ నటించింది. ఇక ఈసినిమాలో  అమల అక్కినేని(Amala Akkineni) ఒక కీలకమైన పాత్రను పోషించారు. ఇక ఇతర ముఖ్యమైన పాత్రలలో వెన్నెల కిషోర్ .. ప్రియదర్శి కనిపించనున్నారు. స్ట్రాంగ్ ఎమోషనల్ కథతో తెరకెక్కించిన  ఈ సినిమాకి జేక్స్ బెజోయ్  మ్యూజిక్ అందించారు. ఫిబ్రవరిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు మూవీ టీమ్.

Also Read ; Pushpa Part-2 : తగ్గేదే లే అంటున్న అల్లు అర్జున్.. పుష్ప పార్ట్ 2 కూడా వచ్చేస్తోంది..?

ఒక ఒక జీవితం మూవీ ఓటీటీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే స్టార్ హీరోలంతా నెక్ట్స్ ఇయర్ సమ్మర్ వరకూ... రిలీజ్ డేట్స్ ను బుక్ చేసుకున్నారు. శర్వానంద్ మూవీ రిలీజ్ చేయాలి అనుకున్న పిబ్రవరిలో కూడా..  మెగాస్టార్  ఆచార్యతో పాటు మరికొన్ని సినిమాల రిలీజ్ లు ఉన్నాయి. దాంతో థియేటర్ల సమస్య వస్తుందన్న ఆలోచనతో.. ఓటీటీ రిలీజ్ రకు వెళ్ళబోతున్నారట మేకర్స్. మరి ఈసారి అయితే శర్వానంద్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా లేదా చూడాలి.

 

PREV
click me!

Recommended Stories

Emmanuel lover ఎవరో తెలుసా? డాక్టర్ ను పెళ్లాడబోతున్న బిగ్ బాస్ 9 టాప్ కంటెస్టెంట్
Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్