Naga Shaurya:ఓటీటిలో గమ్మత్తు..నాగశౌర్యకు నాగశౌర్యే పోటి

Surya Prakash   | Asianet News
Published : Dec 28, 2021, 12:48 PM IST
Naga Shaurya:ఓటీటిలో గమ్మత్తు..నాగశౌర్యకు నాగశౌర్యే పోటి

సారాంశం

నాగశౌర్య ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం లక్ష్య. డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటించి మెప్పించింది.  


సాధారణంగా థియోటర్ లో అయినా ఓటీటిలో అయినా ఒక హీరోకు మరో హీరో సినిమాకు మధ్య పోటీ ఉంటుంది. కానీ చిత్రంగా ఓటీటిలో ఓ గమ్మత్తు చోటు చేసుకుంది. నాగశౌర్య సినిమాలు రెండు ఓటీటిలో ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. నాగశౌర్య నటించిన లక్ష్య, వరుడు కావెలను రెండు చిత్రాలు భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కాలేదు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఓటీటిలో విడుదుల అవుతున్నాయి.  రెండు జనవరి 7 నుంచే ప్రేక్షకులను ఓటీటిలలో అలరించనున్నారు. దాంతో ఇదే ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

నాగశౌర్య నటించిన స్పోర్ట్స్‌ డ్రామా చిత్రం ‘లక్ష్య’. థియేటర్లలో ఇటీవల విడుదలై ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా త్వరలోనే డిజిటల్‌ మాధ్యమంలో సందడి చేయనుంది. ఓటీటీ ‘ఆహా’లో 2022 జనవరి 7 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. విలువిద్య నేపథ్యంలో సాగే ఈ కథకు సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. నాగశౌర్య సరసన కేతికశర్మ మెరిసింది. జగపతిబాబు, సత్య, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు.

 ఈ సినిమా కోసం నాగశౌర్య విలు విద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇందులో రెండు విభిన్నమైన గెటప్స్‌లో కనిపించి ఆకట్టుకున్నారు నాగశౌర్య. తాజాగా ఈ సినిమాలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

అలాగే నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. అక్టోబర్ 29న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. ఈ మూవీకి లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. ప్రేమ, కుటుంబం, అనుబంధాల నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పుడు జీ5 ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. జనవరి 7 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు జీ5 వెల్లడించింది.

Also read నీ పేరేంటి?.. వైసీపీ మంత్రిపై నాని సెటైర్.. నాని గారూ అసలు తగ్గడం లేదుగా!

ఈ మూవీలో ఆకాష్‌ పాత్రలో నాగశౌర్య, భూమి పాత్రలో రీతూవర్మ కనిపిస్తారు. సీనియర్ నటి నదియా హీరోయిన్‌కు తల్లిగా నటించింది. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చగా వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. దర్శకురాలు లక్ష్మీసౌజన్య తొలి సినిమాతోనే మంచి పేరు సంపాదించారు.

Also read Un stoppable:అల్లు అర్జున్ ఎపిసోడ్ ఇలా ఉందేంటి?

PREV
click me!

Recommended Stories

2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్
Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్