‘మహానటి’ లో అర్జున్ రెడ్డి భామ

Published : Sep 11, 2017, 05:26 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
‘మహానటి’ లో అర్జున్ రెడ్డి భామ

సారాంశం

అర్జున్ రెడ్డి తో ఆకట్టుకున్న షాలినీ పాండే అలనాటి నటి సావిత్రి జీవిత కథ  ఆధారంగా మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్

అర్జున్ రెడ్డి సినిమాలో తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది షాలిని పాండే. ఆ సినిమాలో ఆమె నటనకు ఇప్పటికే తెలుగు ఆడియన్స్  ఫిదా అయిపోయారు. అర్జున్ రెడ్డి అలా విడుదలై.. కలెక్షన్ల వర్షం కురిపిస్తుందో లేదో.. అప్పుడే షాలిని కి మరో బంపర్ ఆఫర్ తగిలింది.

 

అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ‘ మహానటి’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సావత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. మరో కీలక పాత్రలో సమంత నటిస్తున్నారు. కాగా.. ఆ సినిమాలోని మరో కీలక పాత్ర కోసం షాలిని పాండేని తీసుకున్నట్లు సమాచారం.

 

నాగ్‌ అశ్విన్‌ ‘మహానటి’కి దర్శకత్వం వహిస్తున్నారు. సావిత్రి కథ తెలుసుకోవడానికి ఆయన చాలా పరిశోధనలు చేశారు. వైజయంతి మూవీస్‌ పతాకంపై ప్రియాంకా దత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్‌, మలయాళ భాషల్లో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, దుల్కర్ సల్మాన్లు కీలక పాత్రలు పోషిస్తుండగా.. విజయ్‌ దేవరకొండ, ప్రగ్యా జైశ్వాల్ ని కూడా ఈ సినిమా కోసం ఎంచుకున్నట్లు సమాచారం.

 

 

 

 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే