నేనమన్న పబ్లిక్ ప్రాపర్టీనా.. మీకు అక్కాచెల్లెళ్లు లేరా

Published : Sep 11, 2017, 04:12 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
నేనమన్న పబ్లిక్ ప్రాపర్టీనా.. మీకు అక్కాచెల్లెళ్లు లేరా

సారాంశం

‘దేవదాసు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన  ఇలియానా బాలీవుడ్ లో పాగా వేసిన  గోవా బ్యూటీ తన బోయ్ ఫ్రెండ్ గురించి తప్పుగా మాట్లాడొద్దట

దేవదాసు సినిమాతో.. తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఇలియానా. తర్వాత పోకిరీ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేసింది. దాదాపు అందరి హీరోలతోనూ ఆడిపాడింది. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరమైన ఈ గోవా భామ.. బాలీవుడ్ లో పగా వేసేందుకు బాగానే ట్రై చేస్తోంది. అడపా దడపా అక్కడ ఛాన్సులు కొట్టేస్తూ.. తన టాలెంట్ నిరూపించుకుంటోంది.

 

 ఆమె నటించిన బాలీవుడ్ సినిమా బాద్షాహో ఇటీవలే విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్లొన్న ఇలియానాను పలువురు అడిగిన ప్రశ్నలు కోపం తెప్పించాయట. అసలు విషయానికి వస్తే.. ఇలియానా కి ఆండ్రూ నిబోస్ అనే బోయ్ ఫ్రెండ్ ఉన్నాడన్న విషయం అందరికీ తెలిసిందే. మొదట ఆండ్రూ.. తన ఫ్రెండ్ మాత్రమే అని చెప్పిన ఇల్లు.. ఇప్పుడు మాత్రం బాహాటంగానే తన బోయ్ బోయ్ ఫ్రెండ్ అని చెప్పుకుంటోంది.అంతేనా, తనను పూర్తిగా అర్థం చేసుకున్న ఆండ్రూ, తన జీవిత భాగస్వామి అయ్యేందుకు అన్ని అర్హతలూ కలిగి వున్నవాడంటూ చెప్పేసింది. అయితే తాను ఎక్కడికి వెళ్లినా తన బాయ్ ఫ్రెండ్ గురించే అడుగుతున్నారట. అది తనకు బాధ కలిగిస్తోందని చెబుతోంది ఇలియానా.

 

'పబ్లిక్‌లో ఉన్న ప్రతీ సందర్భంలోనూ నవ్వుతూ కనిపించడం సాధ్యపడకపోవచ్చు. నేను పబ్లిక్ ఫిగర్‌ని మాత్రమే. పబ్లిక్ ప్రాపర్టీని కాదు. మీరు నా బాయ్‌ఫ్రెండ్ గురించి అడగటంలో తప్పులేదు. కానీ అతడి జాతి గురించి అడగటం బాధకలిస్తోంది. అతను తెల్లగా ఉండటం కారణంగానే నేను డేటింగ్ చేస్తున్నానని చెప్పుకుంటున్నారు. అది నాకు నచ్చడం లేదు. నేను చేస్తున్నది తప్పు అని చెప్పే హక్కు ఎవరికీ లేదు. మీ తల్లులు, చెల్లెల పట్ల అలాగే ప్రవర్తిస్తున్నారా..? మీ వాళ్ళకిచ్చే గౌరవం నాకెందుకు ఇవ్వరు' అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తపరిచింది ఇలియానా

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే