డేరా కోటలో ‘బిగ్ బాస్’ రియాలిటీ షో

First Published Sep 11, 2017, 4:47 PM IST
Highlights
  • దేశవ్యాప్తంగా పాపులరైన  బిగ్ బాస్ షో
  • డేరా కోటలోనూ బిగ్ బాస్ షో
  • హోస్టుగా వ్యవహరించిన డేరా బాబా

గత కొన్ని రోజులుగా దేశంలో సంచలనం సృష్టించిన డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ గురించి రోజుకో వార్త వెలుగులోకి వస్తోంది. ఇద్దరు సాధ్విలను అత్యాచారం చేసిన కేసులో ఆయనకు న్యాయస్థానం జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్టు తర్వాత.. ఆయన డేరా కోటలో పోలీసులు సోదాలు నిర్వహించి రహస్యాలు బయటపెడుతున్నారు. విలాసవంతమైన వస్తువులు, బంగారు కుర్చీ, అత్యంత ఖరీదైన సోఫాలు, ఈఫిల్ టవర్ నిర్మాణం ఇలా కళ్లు చెదిరే నిర్మాణాలు ఆ కోటలో వెలుగుచూస్తున్నాయి.

 

తాజాగా ఈ కోట గురించి మరో విషయం బయటపడింది. దేశ వ్యాప్తంగా పాపులరైన బిగ్ బాస్ షో గురించి అందరికీ తెలిసిందే. ఇటీవలే తెలుగులో ప్రారంభమైన షో.. ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అచ్చం ఇలాంటి గేమ్ షోనే డేరా బాబా కూడా నిర్వహించేవాడట. గుర్మీత్ .. హోస్టుగా నిర్వహించేవాడని, ఆయన దత్త పుత్రిక హనిప్రీత్ సింగ్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేదట. టీవీ షోని తలపించేలా సెట్టింగులు వేసి నెల రోజులు అందులో ఉండాలని చెప్పేవారట. వారికి వివిధ రకాల టాస్కులు ఇచ్చి పూర్తి చేయాలని ఆదేశించేవాడట.

 

 పార్టిసిపెంట్ల సెలక్షన్, ఇతర అంశాలన్నీ హనీప్రీత్ కను సన్నల్లో జరిగేవని తెలుస్తోంది.చివరి వరకు ఆ హౌస్ లో ఉన్నవారిని డేరా విజేతగా ప్రకటిస్తాడట. ఈ విషయాలన్నింటినీ డేరా బాబా మాజీ భక్తుడు గురుదాస్ తూర్ తెలిపారు.

click me!