ఎందుకంత ఆత్రుత.. చూస్తుంటే బాధ కలుగుతోంది: ‘‘ మా ’’ వివాదంపై బాబూ మోహన్ స్పందన

By Siva KodatiFirst Published Sep 9, 2021, 6:57 PM IST
Highlights

మా ఎన్నికల వివాదంపై సినీనటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ స్పందించారు. మా ఎన్నికలపై ఇంతటి ఆత్రుత అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడున్న అసోసియేషన్ చాలా బాగా పనిచేసిందని బాబూ మోహన్ ప్రశంసించారు.

మా ఎన్నికల వివాదంపై సినీనటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ స్పందించారు. మా ఎన్నికలపై ఇంతటి ఆత్రుత అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడున్న అసోసియేషన్ చాలా బాగా పనిచేసిందని బాబూ మోహన్ ప్రశంసించారు. ప్రస్తుతం మాలో జరుగుతున్న పరిణామాలతో చాలా ఆవేదన చెందుతున్నానన్నారు. 

కాగా, అక్టోబర్ 10న 'మా' ఎన్నికలు జరగనున్నాయి. మా ఎన్నికల్లో ప్రధాన పోటీ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, హీరో మంచు విష్ణు మధ్య జరగనుంది. అంతకుముందు అధ్యక్ష బరిలో ఉన్న జీవిత, హేమ పోటీ నుంచి తప్పుకుని ప్రకాష్ రాజ్ ప్యానల్ లో చేరిపోయారు. జీవిత జనరల్ సెక్రటరీగా, హేమ ఉపాధ్యక్షురాలిగా బరిలో నిలిచారు. అప్పటివరకు ప్రకాష్ రాజ్ కు మద్దతు తెలిపిన బండ్ల గణేష్.. జీవిత రాకతో మనస్తాపానికి గురై బయటకు వచ్చారు. తాను సొంతంగా బరిలోకి దిగుతున్నట్లు బండ్ల గణేష్ ప్రకటించారు. అయితే బండ్ల గణేష్ జనరల్ సెక్రటరీ పదవి కోసం పోటీకి దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

Also Read:‘ మా ’’ బిల్డింగ్‌పై వివాదం: అమ్మింది భవనం కాదు.. ఫ్లాట్, శివాజీరాజా క్లారిటీ

తాజాగా మా ఎన్నికల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బాబు మోహన్ మా ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన బరిలోకి దిగుతోంది అధ్యక్ష పదవి కోసం కాదు.. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేయాలని బాబు మోహన్ నిర్ణయించారు. 

ఇదిలా ఉండగా ప్రకాష్ రాజ్ ప్యానల్ తరుపున ఇదే పదవి కోసం హీరో శ్రీకాంత్ బరిలో ఉన్నాడు. కాబట్టి బాబు మోహన్ మంచు విష్ణు ప్యానల్ లో చేరతారా లేక ఒంటరిగా పోటీ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. కొన్ని రోజుల క్రితం బాబు మోహన్ ఓ ఇంటర్వ్యూలో మా ఎన్నికలు ఎలాంటి గొడవలు లేకుండా జరగాలని అన్నారు. కానీ కొన్ని చీడ పురుగుల వల్ల రచ్చ రచ్చ అవుతోందని విమర్శించారు. గతంలో దాసరి.. ఇప్పుడు చిరంజీవి గారు ఈ గొడవలు లేకుండా ఉండేందుకు ప్రయత్నించారని బాబు మోహన్ అన్నారు. 
 

click me!