జూ.ఎన్టీఆర్ ని కొరడాతో కొట్టి ఏడ్చేసిన రాంచరణ్.. దేవుడి దయ వల్ల ఏమీ జరగలేదు

pratap reddy   | Asianet News
Published : Sep 09, 2021, 05:26 PM IST
జూ.ఎన్టీఆర్ ని కొరడాతో కొట్టి ఏడ్చేసిన రాంచరణ్.. దేవుడి దయ వల్ల ఏమీ జరగలేదు

సారాంశం

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గినప్పటికీ పూర్తిగా అంతరించిపోలేదు. ఇప్పటికీ సినిమాలని థియేటర్స్ లో రిలీజ్ చేయాలంటే నిర్మాతలు భయపడుతున్నారు.

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గినప్పటికీ పూర్తిగా అంతరించిపోలేదు. ఇప్పటికీ సినిమాలని థియేటర్స్ లో రిలీజ్ చేయాలంటే నిర్మాతలు భయపడుతున్నారు. కరోనా అలజడి అక్కడక్కడా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద చిత్రాల పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. 

ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు రిలీజ్ కు సరైన టైం కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ చిత్రం కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. అక్టోబర్ లో ఈ చిత్ర రిలీజ్ అనుకున్నప్పటికీ అది వాయిదా పడింది. తదుపరి రిలీజ్ డేట్ ని చిత్ర యూనిట్ ప్రకటించాల్సి ఉంది. 

ఈ గ్యాప్ లో ఆర్ ఆర్ఆర్ చిత్ర విశేషాలు అభిమానులని కుదురుగా ఉండనీయడం లేదు. తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్ర కథకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుజాత ఓ యూట్యూబ్ ఛానల్ లో రివీల్ చేశారు. ఎన్టీఆర్, చరణ్ మధ్య జరిగే ఫైట్ సీన్ కు సంబంధించిన విశేషం అది. 

ఎన్టీఆర్ ని చరణ్ కొరడాతో కొట్టే సన్నివేశం అది. ఆ సీన్ లో చరణ్ ఎన్టీఆర్ ని కొడతారు. నిజంగానే ఎన్టీఆర్ కు దెబ్బ తగిలిందేమోనని చరణ్ ఏడ్చేసినట్లు సుజాత పేర్కొన్నారు. వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్. వెంటనే ఒకరినొకరు కౌగిలించుకున్నారు. 

అదే సన్నివేశంలో చరణ్ కొరడాతో పై నుంచి దూకుతూ ఎన్టీఆర్ ని కొట్టాలి. కానీ అనుకోకుండా చరణ్ కిందపడిపోయారు. మేమంతా చాలా భయపడ్డాం. చిత్ర యూనిట్ మొత్తం కొంత సమయం షాక్ కి గురైంది. దేవుడి దయవల్ల చరణ్ కి చిన్న గాయమే అయింది అని సుజాత పేర్కొన్నారు. 

ఇప్పటికే ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జక్కన్న ఈ అద్భుత చిత్రానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో.. రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Ameesha Patel: నాలో సగం ఏజ్‌ కుర్రాళ్లు డేటింగ్‌కి రమ్ముంటున్నారు, 50ఏళ్లు అయినా ఫర్వాలేదు పెళ్లికి రెడీ
Bigg Boss telugu 9 లో మిడ్ వీక్ ఎలిమినేషన్, ఆ ఇద్దరిలో బయటకు వెళ్లేది ఎవరు?