బెజవాడ కనక దుర్గమ్మకు సోనూసూద్ కోరిక.. ఆ ఒక్కటీ చాలు

pratap reddy   | Asianet News
Published : Sep 09, 2021, 04:19 PM IST
బెజవాడ కనక దుర్గమ్మకు సోనూసూద్ కోరిక.. ఆ ఒక్కటీ చాలు

సారాంశం

నేషనల్ హీరో సోనూసూద్ అభినవ కర్ణుడిగా గుర్తింపు పొందారు. కరోనా కష్టకాలంలో ఎక్కడ చూసినా సోనూ సూద్ పేరే వినిపించేది. అంతా సోనూసూద్ సహాయ కార్యక్రమాలు చేపట్టారు.

నేషనల్ హీరో సోనూసూద్ అభినవ కర్ణుడిగా గుర్తింపు పొందారు. కరోనా కష్టకాలంలో ఎక్కడ చూసినా సోనూ సూద్ పేరే వినిపించేది. అంతా సోనూసూద్ సహాయ కార్యక్రమాలు చేపట్టారు. కరోనా విలయ తాండవం వల్ల ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆర్థికంగా సోనూసూద్ ఆదుకున్నారు. 

ఉద్యోగాలు ఇప్పించాడు. లాక్ డౌన్ లో చిక్కుకుపోయిన వారిని సొంత రవాణా ఖర్చులతో స్వదేశాలకు చేర్చాడు. ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా, తన సొంత టీం తో కరోనా పరిస్థితులని మానిటరింగ్ చేస్తూ అనేకమందికి ప్రాణ దాతగా నిలిచాడు సోనూ సూద్. 

దీనితో సోనూసూద్ ఎక్కడకి వెళ్లినా జనాలు నీరాజనాలు పడుతున్నారు. బుధవారం సోనూసూద్ విజయవాడలో పర్యటించారు. ఇంద్రకీలాద్రిపై సోనూసూద్ కనక దుర్గమ్మన దర్శించుకున్నాడు. అమ్మవారిని సోనూసూద్ కోరిన కోరిక ఒక్కటే.. కరోనా వల్ల దేశం మొత్తం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కరోనా కష్టాలు త్వరగా తొలగిపోవాలి. ప్రజలంతా చల్లగా ఉండాలి అని అమ్మవారిని కోరినట్లు సోనూసూద్ తెలిపారు. అదొక్కటే చాలని సోనూసూద్ అన్నారు. 

ఆలయ అర్చకులు, అధికారులు సోనూసూద్ కి ప్రసాదం, అమ్మవారి చిత్రపటం అందించారు. సోనూసూద్ ని చూసేందుకు జనం ఎగబడ్డారు. సోనూసూద్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంలో నటిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Ameesha Patel: నాలో సగం ఏజ్‌ కుర్రాళ్లు డేటింగ్‌కి రమ్ముంటున్నారు, 50ఏళ్లు అయినా ఫర్వాలేదు పెళ్లికి రెడీ
Bigg Boss telugu 9 లో మిడ్ వీక్ ఎలిమినేషన్, ఆ ఇద్దరిలో బయటకు వెళ్లేది ఎవరు?