
దక్షిణాది తారల్లో క్రేజీ బ్యూటీలు సమంత, కాజల్ ఇద్దరు టాప్ రేంజ్ వున్న హీరోయిన్స్. అయితే ఇద్దరికి అస్సలు ఏ మాత్రం పడదన్నది ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఎ్పట్నుంచో వున్న టాక్. సమంతను ఎక్కడో తక్కువ చేసి మాట్లాడిందని.. ఫీలవుతున్న సమంత కాజల్ మీద ఎప్పుడూ కోపంతో ఊగిపోతుంటుంది. ఇద్దరు కలిసి బృందావనం, బ్రహ్మోత్సవం సినిమాలు చేశారు. కాజల్ ఉన్న చోట సమంత, సమంత ఉన్న చోటా కాజల్ ఎడమోహం పెడమోహంగానే వుంటారని టాక్.
ఇదిలా వుంటే జనతా గ్యారేజ్ ప్రమోషన్స్ లో పక్కా లోకల్ సాంగ్ గురించి అడిగితే ఐటం సాంగ్ చేసే వాళ్ల గురించి నేనేం చెప్పను అనేసింది సమంత. ఇక అప్పటి నుండి కాజల్ సమంతల మధ్య యుద్ధం మరింత పెద్దదైంది. ఈ క్రమంలోనే కాజల్ అంటే అసలు గిట్టట్లేదు సమంతకు.
తాజాగా "రాజు గారి గది-2లో కాజల్ ప్రత్యేక పాత్రలో నటిస్తోందని వార్తలు రావడంతో సమంత బాగా హర్టయ్యిందట. తను హీరోయిన్ గా నటిస్తున్న సినిమాలో కాజల్ ఎందుకు అవసరమా అన్న యాంగిల్ లో మాట్లాడేస్తోందట. కాజల్, సమంత మధ్య ఈ వైరం ఎప్పుడు ముగుస్తుందో చూడాలి. అయితే నాగార్జున కోరిక మేరకే సినిమాలో కాజల్ కూడా నటిస్తుందని తెలుస్తోంది.
కాజల్ ను ఏరికోరి మరీ నాగార్జునే ఈ మూవీలో పెట్టించాడని సమంత బాగా హర్ట్ అయ్యిందట. ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ మధ్య జరుగుతున్న కొనసాగుతున్న వైరం ఎందాక వెళ్తుందో.