
ఇటీవలే అబుదబిలో జరిగిన సైమా అవార్డ్స్ 2017 వేడుకలో... రానా వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కార్యక్రమంలో భాగంగానే రానాని కొన్ని ప్రశ్నలు అడిగారు. తన బ్రెస్ట్ ఫ్రెండ్, తనకు నచ్చిన చోటు, ఇష్టమైన ఫుడ్ లాంటి విషయాలను ఏ మాత్రం తడబడకుండా టక టక చెప్పేశాడు రానా. ఇంతకీ ఆ రోజు రానా చెప్పిన ఆన్సర్లేమిటో చూడండి.
ఒకే పాటను జీవితాంతం వినాల్సి వస్తే బాహుబలి సినిమాలోని మహిష్మతి టైటిల్ సాంగ్ నే వింటాడట. ఎప్పటికీ ఒకే నగరంలో ఉండాల్సి వస్తే హైదరాబాద్ లోనే వుంటాడట. ఇక ఒకే రకం ఫుడ్ తినాల్సి వస్తే హలీమ్ ను, ఒకే సినిమా రోజూ చూడాల్సి వస్తే స్టార్ వార్స్ సినిమాలు చూస్తాడట. ఒకే షో ఎప్పటికీ చూడాల్సి వస్తే మాత్రం టీవీ ఆఫ్ చేసేస్తానన్నాడు. ఒకే మనిషి జీవితాంతం ఫ్రెండ్ గా ఉండాల్సి వస్తే ఆ స్థానం మాత్రం రామ్ చరణ్ కు మాత్రమే ఇస్తానన్నాడు. రానాతో చెర్రీకి ఇంత మంచి ఫ్రెండ్ షిప్ వుందని నిజానికి పెద్దగా బయటి ప్రపంచానికి తెలియదు. కానీ రానాకు, చెర్రీకి మధ్యనున్న ఫ్రెండ్ షిప్ ఏ రేంజ్ లో వుందో దీన్ని బట్టే తెలుస్తోంది.
ఇక లైఫ్ లాంగ్ తన తండ్రి సురేష్ బాబు తనకు పెద్ద ప్రేక్షకుడు అని.. ఆయనిచ్చే ఫీడ్ బ్యాక్ తోనే చాలా డిసిషన్లు తీసుకుంటాను అని కూడా చెప్పాడు. ఒకే స్టార్ తో జీవితాంతం గడపాల్సి వస్తే అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేను అన్నాడు. తాను పుట్టిన దగ్గర నుంచి స్టార్ల మధ్యే పెరిగాను కాబట్టి ఒకే స్టార్ ను ఎంపిక చేసుకోవటం కష్టమన్నాడు. చివరిగా ఒక లవ్ ఎమోజీ ఇప్పుడు మీకు ఇస్తే ఇక్కడకు వచ్చిన వాళ్ళలో ఎవరికి ఇస్తారు అని అడిగితే.. టక్కున నటి ఖుష్బూ కు ఇస్తాను అన్నాడు. ''ఎందుకంటే నేను పుట్టినప్పుడు నుండి ఆవిడకు నేను తెలుసు. నాకు ఆవిడ తల్లి లాంటిది'' అని చెప్పి అందర్నీ మెస్మరైజ్ చేశాడు. స్టార్ ఈజ్ స్టార్. రానా ఎంతైనా బార్న్ స్టార్ కదా..