నితిన్ 'లై' టీజర్‌ రిలీజ్ కు డేట్ ఖరారు

Published : Jul 08, 2017, 06:49 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
నితిన్ 'లై' టీజర్‌ రిలీజ్ కు డేట్ ఖరారు

సారాంశం

యూత్ స్టార్ నితిన్ హీరోగా తెరకెక్కుతున్న లై(లవ్ ఇంటలిజెన్స్ ఎనిమిటి) లై చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న హను రాఘవ పూడి ఆగస్ట్ 11న రిలీజ్ కానున్న ఈ చిత్రం టీజర్ జులై 11న విడుదల

యూత్‌స్టార్‌ నితిన్‌ హీరోగా వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం 'లై' (లవ్‌ ఇంటెలిజెన్స్‌ ఎన్‌మిటి). ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 11న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను జులై 11న విడుదల చేయనున్నారు. అలాగే ఈ చిత్రంలో హీరోకి, విలన్‌కి మధ్య వున్న ఎనిమిటిని తెలిపే పోస్టర్‌ను జూలై 10న రిలీజ్‌ చేస్తున్నారు.

 

యూత్‌స్టార్‌ నితిన్‌, మేఘా ఆకాష్‌, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, శ్రీరామ్‌, రవికిషన్‌, పృథ్వీ, బ్రహ్మాజీ, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్‌, సంగీతం: మణిశర్మ, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, డాన్స్‌: రాజు సుందరం, ఫైట్స్‌: కిచ్చా, పాటలు: కృష్ణకాంత్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయనపల్లి, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే