
మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) మాస్ బీట్ కు స్టెప్పులేస్తున్నాడు. ఇద్దరు హీరోయిన్లతో కలిసి రచ్చ చేస్తున్నాడు రవితేజ. ఈ ఏడాది క్రాక్ సినిమాతో హిట్ కొట్టని స్టార్ హీరో వరుసగా మరోమూడు సినిమాలు లైన్ లో పెట్టేశాడు. ముందుగా రమేష్ వర్మ డైరెక్షన్ లో ఖిలాడి(khiladi) సినిమా చేస్తున్నాడు మాస్ మహారాజ్. కరోనా వల్ల ఖిలాడి షూటింగ్ డిలే అవుతూ వచ్చింది. ప్రస్తుతం మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.
ఖిలాడీ టీమ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నారు. ఈ సినిమా కోసం మాస్ సాంగ్ ను షూట్ చేస్తున్నారు ఇద్దరు హీరోయిన్లు మీనాక్షి చౌదరి .. డింపుల్ హయతి తో కలిసి రవితేజ మాస్ స్టెప్పులు వేస్తున్నారు. మ్యూజిక్ కింగ్ దేవిశ్రీ(Devisri) మ్యూజిక్ చేసిన సాంగ్ కు.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫీలో సాంగ్ షూట్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరో విశేషం ఏంటీ అంటే.. ఈ సాంగ్ ను రవితేజానే స్వయంగా పాడినట్టు తెలుస్తోంది. దేవిశ్రీ ట్యూస్ చేసిన సాంగ్ ను మాస్ మహారాజ్ తో పట్టుపట్టి పాడించాడని టాక్.
మాస్ పర్ఫామెన్స్ తో రచ్చ చేసే రవితేజకు ఫాలోయింగ్ భారీగానే ఉంది. అటుంటిది డైరెక్ట్ గా రవితేజానే సాంగ్ పాడాడంటే అది కూడా మాస్ సాంగ్ పాడారు అంటే.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే. పిబ్రవరి 11న రిలీజ్ కాబోతున్నkhiladi సినిమాలో రవితేజతో పాటు అర్జున్,సచిన్ ఖేడ్కర్, అనసూయ ఉన్నిముకుందన్ తదితర స్టార్లు ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఖిలాడితో పాటు రామారావ్ ఆన్ డ్యూటీ, ధమాకా ఇంకా మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టారు రవితేజ.
Also Read : SPIDER MAN RELEASE: ఒక రోజు ముందే రిలీజ్ కు స్పైడర్ మ్యాన్.. బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి.