Chiranjeevi Birthday wishes to Venkatesh: వెంకీ మామకు చిరు స్పెషల్ బర్త్ డే విషెస్

Published : Dec 13, 2021, 03:17 PM IST
Chiranjeevi Birthday wishes to Venkatesh: వెంకీ మామకు చిరు స్పెషల్ బర్త్ డే విషెస్

సారాంశం

విక్టరీ వెంకటేష్ జన్మదినం నేడు (Venkatesh Birthday). డిసెంబర్ 13, 1960లో జన్మించిన వెంకటేష్ 61వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చిత్ర ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.   


మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తన చిరకాల మిత్రుడు వెంకటేష్ కి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు చిరంజీవి ట్వీట్ చేయడం జరిగింది. 'మై డియర్ బ్రదర్ అండ్ ఫ్రెండ్ వెంకటేష్ కి జన్మదిన శుభాకాంక్షలు. ఎప్పుడూ తరగని శక్తిని, నా మోముపై చిరునవ్వు పంచే నీకు ధన్యవాదాలు. ఇలాంటి పుట్టినరోజులు నీవు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను..' అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

టాలీవుడ్ టాప్ స్టార్స్ గా చిరంజీవి, బాలకృష్ణ (Balakrishna), వెంకటేష్, నాగార్జున పరిశ్రమను దశాబ్దాల పాటు ఏలారు. ఈ నలుగురు హీరోల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. ముఖ్యంగా వెంకటేష్ కి పరిశ్రమలో వివాదరహితుడిగా పేరుంది. చాలా సరదాగా ఉండే వెంకీని పరిశ్రమలో అందరూ ఇష్టపడతారు. 

ఇక తన ఇమేజ్, ఏజ్ కి తగ్గట్టుగా చిత్రాలు చేస్తున్నారు వెంకటేష్. ఈ మధ్య కాలంలో ఆయన ఎంచుకున్న సబ్జక్ట్స్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. చిరు, బాలయ్య, నాగ్ లతో పోల్చుకుంటే ఓటిటిలో కూడా వెంకీమామదే మొదటి అడుగు. ఇప్పటికే వెంకటేష్ నేరుగా రెండు చిత్రాలు ఓటిటిలో విడుదల చేశారు. నారప్ప, దృశ్యం 2 చిత్రాలు నేరుగా ఓటిటిలో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అలాగే రానా నాయుడు పేరుతో అబ్బాయి రానాతో కలిసి ఏకంగా సిరీస్ చేస్తున్నారు. ఓటిటి దిగ్గజం నెట్ఫ్లిక్స్ ఒరిజినల్స్ నిర్మాణంలో ఈ సిరీస్ తెరకెక్కుతుంది.

Also read F3:వెంకటేష్ బర్తడే స్పెషల్ వీడియో

కాగా వెంకటేష్ చేస్తున్న మల్టీస్టారర్ ఎఫ్ 3 షూటింగ్ జరుపుకుంటుంది. వరుణ్ తేజ్ మరో హీరోగా నటిస్తుండగా.. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. 

Also read చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన `బిగ్‌బాస్‌ 5` ఫేమ్‌ లోబో..

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్