Pushpa: సమంత ఐటెం సాంగ్ పై కేసు నమోదు.. బ్యాన్ చేయాలంటూ డిమాండ్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 13, 2021, 03:26 PM IST
Pushpa: సమంత ఐటెం సాంగ్ పై కేసు నమోదు.. బ్యాన్ చేయాలంటూ డిమాండ్

సారాంశం

సమంత హీరోయిన్ గా ఎన్నో గ్లామర్ పాత్రల్లో నటించింది. కానీ ఇంతవరకు సమంత ఐటెం సాంగ్ చేయలేదు. కానీ తొలిసారి అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో సామ్ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. 

గత కొన్ని నెలలుగా Samantha పేరు మీడియాలో వినిపిస్తూనే ఉంది. చైతూతో బ్రేకప్ తర్వాత సమంత సమంత గురించి అనేక కథనాలు మీడియాలో వస్తూనే ఉన్నాయి. తన జీవితంలో జరిగిన ఈ సంఘటన తర్వాత ఆశలన్నీ శిథిలమై పోయినట్లు సమంత ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. అయితే అనవసరంగా తనని ట్రోల్ చేయవద్దని మాత్రం అభిమానులని కోరింది. 

చేదు జ్ఞాపకాల నుంచి బయట పడుతూ సామ్ తన చిత్రాలపై ఫోకస్ పెట్టింది. సమంత హీరోయిన్ గా ఎన్నో గ్లామర్ పాత్రల్లో నటించింది. కానీ ఇంతవరకు సమంత ఐటెం సాంగ్ చేయలేదు. కానీ తొలిసారి Allu Arjun పుష్ప చిత్రంలో సామ్ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. 'ఊ అంటావా ఊఊ అంటావా' అంటూ సాగే ఈ పాట యూట్యూబ్ లో సునామీ సృష్టిస్తోంది. 

మాస్ జనాలు థియేటర్స్ లో ఊగిపోయేలా ఈ సాంగ్ ఉంది. అయితే ఈ పాట విడుదలైనప్పుడే లిరిక్స్ పై కొందరి నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. మహిళల విషయంలో మగవారంతా చెడ్డవారే, శృంగారమే వారికి కావాల్సింది అని అర్థం వచ్చేలా లిరిక్స్ ఉన్నాయి. 

దీనితో ఆంధ్రప్రదేశ్ లో సమంత ఐటెం సాంగ్ పై పురుషుల అసోసియేషన్ కేసు నమోదు చేసింది. పురుషులపై తప్పుడు అభిప్రాయం కలిగించేలా ఉన్న ఈ పాటని బ్యాన్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కోర్టులో ఈ కేసుపై విచారణ జరగాల్సి ఉంది. సమంత నటించిన తొలి ఐటెం సాంగ్ పైనే కేసు నమోదు కావడం ఆమె అభిమానులకు నిరాశ కలిగించే అంశమే. 

ఈ సాంగ్ థియేటర్స్ లో దుమ్ము లేచిపోయేలా ఉంటుందని స్వయంగా అల్లు అర్జున్ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలిపాడు. దీనితో ఈ పాటపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. మతైన వాయిస్ తో ఈ పాటని మంగ్లీ సోదరి ఇంద్రావతి పాడారు. చంద్రబోస్ ఈ సాంగ్ కి లిరిక్స్ అందించారు. పుష్ప చిత్రంలో అన్ని పాటలు రాసింది చంద్రబోసే. 

Also Read: సమంతకు అస్వస్థత..ఆసుపత్రిలో చికిత్స

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం
Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌