
రామ్ చరణ్ - ఎన్టీఆర్ హీరోలుగా.. రాజమౌళి డైరెక్షన్ లో దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న సినిమా ట్రిపుల్ ఆర్. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈమూవీ సంక్రాంతి కానుకగా జనవరి 7న రిలీజ్ కాబోతుంది. రిలీజ్ దగ్గర పడుతుండటంతో.. పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషన్స్ కూడా స్పీడ్ అప్ చేశారు ట్రిపుల్ ఆర్ టీమ్. జక్కన్న తన టాలెంట్ తో సినిమాపై హైప్ ను మరింత పెంచే ప్రయత్నం మొదలు పెట్టేశాడు కూడా.
ఇక దీనితో పాటు సినిమా బిజినెస్ పై కూడా గట్టిగానే కన్నేశాడు జక్కన్న. ట్రిపుల్ ఆర్ సినిమా నుంచి ఇప్పటికే అప్ డేట్స్ చాలా వచ్చాయి. మూడు పాటలతో పాటు మేకింగ్ వీడియోస్.. ఇంట్రడక్షన్ వీడియోస్.. పోస్టర్స్.. తో పాటు రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. యాక్షన్ సీక్వెన్స్ లతో ఒళ్లు గగుర్పొడిచే ట్రీట్ ఇచ్చారు మూవీ టీమ్. ట్రైలర్ రిలీజ్ తో అటు మెగా ఫ్యాన్స్.. ఇటు నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
Also Read : RRR: ఆ భాష ఒక్కటే ఇబ్బంది పెట్టింది... కూనీ చేస్తున్నామేమో అనిపించిందన్న తారక్...
బాలీవుడ్ భామ అలియా భట్, హాలీవుడ్ స్టార్ ఒలివియా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో.. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అజయ్ దేవగన్, శ్రియా సరన్ మెయిన్ రోల్స్ పాత్రలు పోషిస్తున్నారు. హిందీలో ఆర్‌ఆర్‌ఆర్ థియేట్రికల్ రైట్స్‌తో పాటు శాటిలైట్ రైట్స్‌ను ఫేమస్ సంస్థ పెన్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ మొత్తానికి తీసుకుంది. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన 90 రోజుల తర్వాత హిందీ వెర్షన్ మూవీ జీ5, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యేలా..ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది.
Also Read : RRR: ట్రిపుల్ ఆర్ హీరోలకు రాజమౌళి టార్చర్.... తట్టుకోలేకపోయామన్న హీరోలు....
ఇక ఈమూవీ ఓటీటీ రిలీజ్ పైకూడా ఇండస్ట్రీలో రూమర్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. తెలుగు వెర్షన్ తో సహా ట్రిపుల్ ఆర్ ఓటీటీ రిలీజ్ కు సంబంధించి నెట్స్ ప్లిక్స్ తో ఒప్పందం కుదిరిందని టాక్ వినిపిస్తుంది. ఫ్యాన్సీ రేటుకు ఈమూని నెట్స్ ప్లిక్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది. సినిమా రిలీజ్ అయిన రెండు నెలల తరువాత ఓటీటీలో రిలీజ్ చేసుకునేలా డీల్ కుదుర్చుకున్నట్టు సమాచారం. ఈ విషయం గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాకపోయినా.. ఇండస్ట్రీలో మాత్ర న్యూస్ వైరల్ అవుతుంది.