Jayamma Panchayathi Teaser : వార్నింగ్ ఇస్తున్న యాంకర్ సుమ.. తేల్చుకుంటానంటుంది..

Published : Dec 12, 2021, 04:43 PM IST
Jayamma Panchayathi Teaser : వార్నింగ్ ఇస్తున్న యాంకర్ సుమ.. తేల్చుకుంటానంటుంది..

సారాంశం

టాలీవుడ్ స్టార్ హోస్ట్ సుమ కనకాల చాలా కాలం తరువాత నటిస్తున్న సినిమా జయమ్మ పంచాయితీ. ఈమూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు టీమ్.   

యాంకర్ గా ఎవరూ అందుకోలేని స్థాయిలో స్టార్ డమ్ సంపాదించింది సుమ కనకాల. కెరీర్ బిగినింగ్ లో నటిగా కొనసాగిన సుమ.. ఆరుతవా వర్షంలాంటి సినిమాల్లో నటించింది. చాలా కాలం తరువాత మళ్ళీ వెండితెరపై జయమ్మ పంచాయితీ సినిమాతో మెరవబోతోంది సుమ.
‘జయమ్మ పంచాయితీ’ సినిమా విలేజ్ బ్యాక్  డ్రాప్ లో తెరకెక్కుతోంది. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై బలగ ప్రకాష్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీతో విజయ్ కుమార్ కలివారపు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.మరో విశేషం ఏంటీ అంటే ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి  సంగీతం అందించారు. ఈమూవీ నుంచి టీజర్ ను ఈరోజు (ఆదివారం) హీరో  రానా రిలీజ్ చేశారు. 

 

టీజర్ తోనే దుమ్మురేపింది సుమ కనకాల. పెర్ఫామెన్స్ పీక్స్ చూపించింది. ముఖ్యంగా మాస్ డైలాగ్స్ తో మెస్మరైజ్ చేసింది సుమ. చూడు జ‌య‌మ్మా.. నాకు తెలిసి ఈ చుట్టూ ప‌క్క‌ల ఊళ్ల‌లో ఇలాంటి గొడ‌వ జ‌రిగి ఉండ‌దు. నీతరపున న్యాయం ఉంది.. రెండు రోజుల్లు తగవు తీరుస్తాను అని ఊరి పెద్ద చెప్పగానే..‘రెండు రోజుల్లో తేల్చ‌క‌పోతే మీరు ఉండ‌రు.. మీ పంచాయితీ ఉండ‌దు చెప్తున్నా’ అని సుమ ఇచ్చిన  వార్నింగ్‌ డైలాగ్‌తో జ‌య‌మ్మ పంచాయితీ టీజ‌ర్ మొదలైంది. ఈ డైలాగ్ ఒక్కటి చాలు సినిమా ఎలా ఉండబోతోందో తెలుసుకోవడానికి. 

Also Read : Rajinikanth Birthday Special : రజనీ కాంత్ కు ఎన్ని అవార్డ్స్ వచ్చాయో తెలుసా..? రజనీ సంపాదన ఎంతుంటుంది..?


ఈ సినిమాపై గట్టిగానే దృష్టి పెట్టింది సుమ కనకాల. లాంగ్ గ్యాప్ తరువాత చేస్తుండటం.. ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలతో ఉంది. తనకు ఉన్న పలుకుబడిని కూడా వాడేసుకుంటుంది. స్టార్ హీరోలతో ప్రమోషన్స్ కూడా చేయిస్తుంది సుమ. ఈమూవీ పోస్టర్స్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నేచురల్ స్టార్ నానిలతో ప్రత్యేకంగా రిలీజ్ చేయించిన సుమ... టీజర్ ను రానా చేతుల రిలీజ్ చేయించింది. కరోనా పాండమిక్ నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న ఈ టైమ్ లో.. సుమ తన సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చూస్తుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే