Pawan Kalyan: రష్యాకి పయనం కాబోతున్న పవన్ కళ్యాణ్.. కొన్ని రోజులు అక్కడే..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 12, 2021, 03:49 PM IST
Pawan Kalyan: రష్యాకి పయనం కాబోతున్న పవన్ కళ్యాణ్.. కొన్ని రోజులు అక్కడే..

సారాంశం

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ సంక్రాంతి మెమొరబుల్ గా మారబోతోంది. పవన్ కళ్యాణ్ ఫుల్ మాస్ యాటిట్యూడ్ తో నటిస్తున్న Bheemla Nayak చిత్రం జనవరి 12 న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ సంక్రాంతి మెమొరబుల్ గా మారబోతోంది. పవన్ కళ్యాణ్ ఫుల్ మాస్ యాటిట్యూడ్ తో నటిస్తున్న Bheemla Nayak చిత్రం జనవరి 12 న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన భాగం షూటింగ్ ని పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఇది. సాగర్ చంద్ర దర్శకుడు. 

ఇదిలా ఉండగా త్వరలో Pawan Kalyan రష్యాకు పయనం కాబోతున్నట్లు తెలుస్తోంది.  భీమ్లా నాయక్ లో తన పార్ట్ షూటింగ్ ముగిసింది కాబట్టి రెండు వారాలు విశ్రాంతి తీసుకునేందుకు పవన్ రష్యా వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా, పిల్లలు రష్యాలోని ఉన్నారు. క్రిస్టమస్ సంబరాలలో పవన్ వారితో జాయిన్ అవుతారు. 

డిసెంబర్ 20న పవన్ రష్యా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తర్వాత పవన్ తిరిగి ఇండియా రానున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ తిరిగి రష్యా నుంచి వచ్చిన తర్వాత క్రిష్ దర్శకత్వంలోని హరిహర వీర మల్లు షూటింగ్ పునః ప్రారంభం కానుంది. 

సినిమాలు, రాజకీయాలు పక్కన పెట్టి ఫ్యామిలీతో సంతోషంగా గడిపేందుకు పవన్ రష్యా వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. భీమ్లా నాయక్ చిత్రంలో పవన్ కి జోడియాగా నిత్యా మీనన్, రానాకు జంటగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. హరిహర వీరమల్లు తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్ సింగ్' మూవీలో నటించాల్సి ఉంది. 

బీమ్లా నాయక్ మూవీ మలయాళీ సూపర్ హిట్ అయ్యప్పన్ కోషియం చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతోంది. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. 

Also Read: 'మా' ప్రెసిడెంట్ మంచు విష్ణు సంచలన నిర్ణయం... ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులకు ఝలక్!

Also Read: Bheemla Nayak: ఆత్మను చంపేశారు... ఫలితం ఎలా ఉంటుందో

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే