RRR official update: వరల్డ్ బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్‌కి సిద్ధమైన రాజమౌళి టీమ్‌..

Published : Oct 27, 2021, 07:36 PM ISTUpdated : Oct 27, 2021, 07:48 PM IST
RRR official update: వరల్డ్ బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్‌కి సిద్ధమైన రాజమౌళి టీమ్‌..

సారాంశం

దాదాపు రెండు నెలల పాటు మెసలనివ్వకుండా ప్రమోషన్‌ చేసేందుకు జక్కన్న టీమ్‌ రెడీ అవుతుందట. తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ నెల 29న వరల్డ్ బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నట్టు చెప్పింది యూనిట్‌. 

తెలుగులోనే కాదు, ఇండియా వైడ్‌గా అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR Movie). దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఎన్టీఆర్‌(Ntr), రామ్‌చరణ్‌(Ram Charan) హీరోలుగా నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటి అలియాభట్‌, బ్రిటీష్‌ నటి ఒలీవియా మోర్రీస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్‌ దేవగన్‌, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగుతోపాటు దాదాపు పది ఇండియన్‌ లాంగ్వేజెస్‌లో పాన్‌ ఇండియన్‌ చిత్రంగా సినిమా విడుదల కాబోతుంది. జనవరి 7న సినిమాని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. 

ఈ నేపథ్యంలో RRR Movie ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేశారు. దాదాపు రెండు నెలల పాటు మెసలనివ్వకుండా ప్రమోషన్‌ చేసేందుకు జక్కన్న టీమ్‌ రెడీ అవుతుందట. తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు. october 29thన వరల్డ్ బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నట్టు చెప్పింది యూనిట్‌. మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుందని తెలిపింది. అంతేకాదు అదే రోజు ఓ క్రేజీ ఎగ్జైటింగ్ అప్‌డేట్‌ ఇవ్వబోతున్నట్టు తెలిపింది యూనిట్‌. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. 

ఈ నెల 29న `ఆర్‌ఆర్ఆర్‌` టీమ్‌ ఏం సర్ప్రైజ్‌ చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఆ రోజు `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రానికి సంబంధించిన టీజర్‌ని విడుదల చేసే అవకాశం ఉందట. అంతేకాదు దుబాయ్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ డిటెయిల్స్ కూడా ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. దుబాయ్‌లో భారీ ఎత్తున ఈ ఈవెంట్‌ని ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు దీపావళి సందర్భంగా కూడా మైండ్‌ బ్లోయింగ్‌ ట్రీట్‌ ఇవ్వాలని రాజమౌళి బృందం సన్నాహాలు చేస్తుందట. 

ప్రస్తుతం సినిమాపై ఆశించిన స్థాయిలో హైప్‌ లేదు. దాదాపు నాలుగు సార్లు వాయిదా పడటంతో క్రమంగా అంచనాలు తగ్గిపోయాయి. దీంతో వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా ప్రమోట్‌ చేయాలని, భారీ అంచనాలు పెంచాలని అనుకుంటున్నారట. అందులో భాగంగానే విదేశాల్లో ఈవెంట్లు ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఇండియాలోని ప్రధాన నగరాల్లోనూ ఈవెంట్లు ఏర్పాటు చేసి ప్రమోషన్‌ గట్టిగా చేయబోతున్నట్టు సమాచారం. దాదాపు రెండు నెలలపాటు ఆడియెన్స్ ని `ఆర్‌ఆర్‌ఆర్‌` ప్రమోషన్‌తో ఎంగేజ్‌ చేయాలని చూస్తున్నారు. 

also read: RRR movie prerelease event : ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా... దుబాయిలో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న జక్కన్న!

`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా జనవరి 7న విడుదల కాబోతుంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కేవలం వారం రోజులపాటు మాత్రమే కలెక్షన్లని రాబట్టుకునే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత పవన్‌ కళ్యాణ్‌ `భీమ్లా నాయక్‌`, మహేష్‌ `సర్కారు వారి పాట`, ప్రభాస్‌ `రాధేశ్యామ్‌` చిత్రాలు బ్యాక్‌ టూ బ్యాక్‌ 12,13,14 తేదీల్లో విడుదల కాబోతున్నాయి. ఈ భారీ చిత్రాల ప్రభావం `ఆర్‌ఆర్‌ఆర్‌`పై గట్టిగానే ఉంటుంది. అందుకోసం ఇతర స్టేట్స్ మార్కెట్‌, ఇతరదేశాల మార్కెట్‌పై కన్నేసిందట `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ. అందులో భాగంగా ఊహించని విధంగా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్లాన్‌ చేసినట్టు తెలుస్తుంది. 

also read: వైరల్‌ అవుతున్న సమంత పోస్ట్.. కూతుళ్లని పెళ్లికోసం కాదు తనకోసం బతికేలా పెంచండి అంటూ..

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: జ్యోకు గట్టిగా ఇచ్చిపడేసిన కార్తీక్- మనుమడిని మెచ్చుకున్న పారు
Bayilone Ballipalike : దుమ్ములేపుతున్న మంగ్లీ ఫోక్ సాంగ్, 10 రోజుల్లోనే ఎన్ని కోట్ల వ్యూస్ రాబట్టిందంటే?