
మెగా పవర్ స్టార్ చరణ్(Ram Charan) -యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) హీరోలుగా రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం `ఆర్ ఆర్ ఆర్`(RRR). షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. రాబోయే రెండు నెలల్లో అన్ని పనులు పూర్తిచేసి సంక్రాంతి కల్లా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యూనిట్ ప్లాన్. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు. తాజాగా ప్రచార కార్యక్రమానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది.
ఈ సినిమాకు సంభందించిన దీపావళి కానుకగ స్పెషల్ టీజర్ లాంచ్ అక్టోబర్ 29 న జరగే అవకాసం ఉంది. సినిమా రిలీజ్ అయ్యే అన్ని భాషల్లోనూ ఈ టీజర్ ని రిలీజ్ చేస్తారు. ఈ టీజర్ లో ఈ సినిమా ఎలా ఉండబోతోంది. సినిమాలో కొన్ని కీ సీన్స్ చూపబోతున్నారు. ఈ మేరకు డబ్బింగ్ వర్క్ జరుగుతోందట. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని దుబాయ్ లో గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. సినిమాకు పనిచేసిన కీలక వ్యక్తులందర్ని దుబాయ్ కి తీసుకెళ్లాలని టీమ్ ప్లాన్ చేస్తోందట. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వినికిడి.
అలాగే హైదరాబాద్, విశాఖపట్టణం, చెన్నై, బెంగుళూరు, ముంబై,కొచ్చి లలో కూడా ఈవెంట్స్ జరపనున్నారు. డిసెంబర్ నుంచి ఈ ప్రమోషన్స్ ప్రారంభమవుతాయి. అయితే ఇంకా అధికారికంగా ఈ విషయమై కన్ఫర్మేషమ్ లేదు. ఇక ఈ చిత్రం టీజర్ కు సంభందించిన ఎనౌన్సమెంట్ బుధవారం వచ్చే అవకాసం ఉంది. ఇక ఇప్పటికే ఈ సినిమా పనులన్నీ పూర్తి అయ్యాయి. కానీ Rajamouliమరోసారి ఫైనల్ కట్ కూడా రెడీ చేసారు. ఈ చిత్రంలో చివరి 30 నిమిషాల క్లైమాక్స్ ఉంటుందని. ఇది సినిమాకే హైలెట్ అయి.. యాక్షన్ సన్నీవేశాలను చాలా ఉత్కంఠ భరితంగా తెరకెక్కించినట్టు చెప్పుకుంటున్నారు.
మరో ప్రక్క సినిమా రన్ టైమ్ కూడా ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. ఈ సినిమా దాదాపు రెండు గంటల 45 నిమిషాల నిడివి ఉంటుందని టాక్. బహుబలి సినిమా కంటే.. RRR సినిమా కోసం రన్ టైమ్ ను పెంచినట్టు తెలుస్తుంది. రాజమౌళి.. గత చిత్రాలు బాహుబలి, బాహుబలి 2 కూడా మిగతా చిత్రాలతో పోల్చితే ఎక్కువ రన్ టైం కలిగి ఉన్నాయి.
ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వేయిట్ చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికే పలుసార్లు విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది రాజమౌళి అండ్ టీం. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఇద్దరు హీరోల ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. అయితే ఇవి విడుదలై చాలా రోజులవుతోన్నా ఇప్పటి వరకు మరో అప్‌డేట్ మాత్రం రాలేదు. దీంతో అభిమానులు సినిమా టీజర్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్ర టీజర్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఆర్.ఆర్.ఆర్ సినిమా టీజర్‌ను అక్టోబర్ 29న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
also read: 'రాధే శ్యామ్': ప్రభాస్ పాత్ర కు బేస్ ఆయన జీవిత చరిత్రే