పూర్ణ `బ్యాక్‌ డోర్‌` ట్రైలర్‌ని ఆవిష్కరించిన దర్శకేంద్రుడు..

Published : Oct 27, 2021, 06:09 PM IST
పూర్ణ `బ్యాక్‌ డోర్‌` ట్రైలర్‌ని ఆవిష్కరించిన దర్శకేంద్రుడు..

సారాంశం

`ఢీ` జడ్జ్ పూర్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ `బ్యాక్‌ డోర్`. నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్‌ని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు విడుదల చేశారు. 

`ఢీ` ఫేమ్‌ పూర్ణ (poorna) ప్రధాన పాత్రలో `బ్యాక్‌ డోర్‌` చిత్రంలో నటిస్తుంది. తేజ త్రిపురాన హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వం వహించారు. ఆర్చిడ్‌ ఫిల్మ్స్ పతాకంపై బి. శ్రీనివాస్‌రెడ్డి నిర్మించారు.  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. సెన్సార్‌ పూర్తి చేసుకుని క్లీన్‌ యూ సర్టిఫికేట్‌ని పొందింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు విడుదల చేశారు. 

కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ,  `బ్యాక్ డోర్` టీజర్ కి పది మిలియన్ వ్యూస్ వచ్చాయని విన్నాను. ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. దీనికి కచ్చితంగా రెట్టింపు వ్యూస్ వస్తాయి. టీమ్ కి ఆల్ ది బెస్ట్` అని అన్నారు.
  లెజండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు తమ చిత్రం ట్రైలర్ లాంచ్ చేసి, బెస్ట్ విషెస్ చెప్పడం పట్ల దర్శకుడు కర్రి బాలాజీ, హీరో తేజ త్రిపురాన సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, అంబికా రాజా ప్రత్యేక అతిధిలుగా పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
  

ఈ చిత్రానికి కో-డైరెక్టర్: భూపతిరాజు రామకృష్ణ, పోస్టర్ డిజైన్: విక్రమ్ రమేష్, కొరియోగ్రఫీ: రాజ్ కృష్ణ, పాటలు: నిర్మల- చాందిని, సంగీతం: ప్రణవ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్, ఆర్ట్: నాని, ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, ప్రొడక్షన్ డిజైనర్: విజయ ఎల్.కోట, పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రేఖ, కో-ప్రొడ్యూసర్: ఊట శ్రీను, నిర్మాత: బి.శ్రీనివాస్ రెడ్డి, రచన-దర్శకత్వం: కర్రి బాలాజీ. 

poorna ఓ  వైపు హీరోయిన్ గా రాణిస్తూ మరోవైపు టీవీ షోస్‌తో బిజీగా ఉంది. ఆమె ఇటీవల `సుందరి`, `తలైవి` చిత్రాల్లో మెరిసింది. `తలైవి`లో శశికళగా అద్భుతంగా నటించి మెప్పించింది. మరోవైపు `ఢీ` డాన్స్ షో ద్వారా టీవీ ఆడియెన్స్ కి బాగా దగ్గరైంది. ఇందులో పూర్ణ జడ్జ్ గా మెప్పిస్తుంది. ఓ వైపు గ్లామర్‌ ఫోటో షూట్లతో నెటిజన్లకి దగ్గరవుతుంది పూర్ణ. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది. 

also read: హాట్‌ షోతో విజువల్‌ ఫీస్ట్ నిచ్చిన మెహరీన్‌.. ఎట్టకేలకు మంచిరోజులొచ్చాయట..
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా
Suriya: కంగువతో విమర్శలు, హ్యాట్రిక్ హిట్లు కొట్టేందుకు ప్లాన్.. సూర్య చేస్తున్న 3 సినిమాలు ఇవే