rrr movie update: మరికొన్ని గంటల్లో సునామి!

Published : Oct 29, 2021, 11:39 AM ISTUpdated : Oct 29, 2021, 11:40 AM IST
rrr movie update: మరికొన్ని గంటల్లో సునామి!

సారాంశం

RRR movie పై నేడు బిగ్ అప్డేట్ ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెల్సిందే. దానిలో భాగంగా ఆర్ ఆర్ ఆర్ యూనిట్ ఓ గ్లిమ్ప్స్ విడుదల చేశారు.

ఆర్ ఆర్  ఆర్ మూవీ ప్రభంజనం మొదలైపోయింది. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు రాజమౌళి. బాహుబలికి మించిన స్ట్రాటజీస్ తో అతిపెద్ద హిట్ అందుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇక RRR movie పై నేడు బిగ్ అప్డేట్ ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెల్సిందే. దానిలో భాగంగా ఆర్ ఆర్ ఆర్ యూనిట్ ఓ గ్లిమ్ప్స్ విడుదల చేశారు. 


ముంబైలోని అంథేరీ ఏరియాలో గల పీవీఆర్ థియేటర్, ఆర్ ఆర్ ఆర్ పోస్టర్స్ తో నిండి ఉన్న వీడియో విడుదల చేశారు. అదే సమయంలో ఓ రెడ్ క్లాత్ మెయిన్ బోర్డుని కవర్ చేస్తూ ఉంది. ఆర్ ఆర్ ఆర్ నుండి నేడు వస్తున్న అప్డేట్ ఏమిటనే ఆసక్తిని ఈ గ్లిమ్ప్స్ వీడియో మరింత పెంచేసింది.  ఆర్ ఆర్ ఆర్ ప్రొమోషన్స్, భారీ నిర్మాణ సంస్థలో కూడిన ఒప్పందానికి సంబంధించిన ఈవెంట్ అక్కడ నిర్వహిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. 


ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ కోసం Rajamouli పీవీఆర్ థియేటర్స్ తో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు సమాచారం. అలాగే ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇంగ్లీష్ వర్షన్ విడుదలకు ప్రఖ్యాత వార్నర్ బ్రదర్స్ సంస్థ ముందుకు వచ్చినట్లుగా కూడా కథనాలు వెలువడుతున్నాయి. మరోవైపు 30-40 నిమిషాల నిడివి కలిగిన టీజర్ సిద్ధం చేశారట. పలు బాషలలో విడుదల కానున్న ఈ RRR teaser విడుదల తేదీపై కూడా నేడు క్లారిటీ వచ్చే సూచనలు కలవు. మొత్తంగా రాజమౌళి ప్రమోషన్స్ లో జోరు చూపిస్తున్నారు. ఇంకొన్ని గంటలలో ఆర్ ఆర్ ఆర్ నుండి వస్తున్న ఆ అప్డేట్ ఏమిటో తెలిసిపోతుంది. 

Also read ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ : ఆ యూట్యూబ్ ఛానల్ తో టై అప్ కాబోతున్న రాజమౌళి?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం, ఉద్యమ వీరులైన కొమరం భీమ్, అల్లూరి జీవిత చరిత్రల ఆధారంగా తెరకెక్కింది. NTR భీమ్ గా, Ram charan అల్లూరిగా నటిస్తున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. డివివి దానయ్య దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో ఆర్ ఆర్ ఆర్ నిర్మించారు. అజయ్ దేవ్ గణ్, సముద్ర ఖని, శ్రీయా శరణ్ ఇతర కీలక రోల్స్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 

Also read 'ఆర్ఆర్ఆర్': కొత్త లీక్, మ్యాటర్ మామూలుగా లేదుగా
 

PREV
click me!

Recommended Stories

భార్యతో పదేళ్ల ప్రేమను సెలబ్రేట్ చేసుకున్న రిషబ్ శెట్టి..బ్యూటిఫుల్ ఫోటోస్ వైరల్
Medha Rana: బోర్డర్ 2తో ప్రేక్షకుల మనసు గెలిచిన నటి ? ఆమె కుటుంబ సభ్యులంతా..