ప్రముఖ యాంకర్, నటి అనసూయ (Anchor Anasuya) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ విషయంలో తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు (Minister KTR) అనసూయ ట్విట్టర్ వేదికగా ఓ అభ్యర్థన చేసింది.
ప్రముఖ యాంకర్, నటి అనసూయ (Anchor Anasuya) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. తన అభిమానులకు అప్‌డేట్స్ ఇవ్వడంతో పాటుగా, సామాజిక అంశాలపై కూడా ఆమె స్పందిస్తూ ఉంటారు. అంతేకాకుండా తనపై నెగిటివ్ కామెంట్స్ చేసేవారికి కూడా అనసూయ తనదైశ శైలిలో ఘాటైన కౌంటర్స్ ఇస్తుంటారు. అయితే తాజాగా ఓ విషయంలో తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు అనసూయ ట్విట్టర్ వేదికగా ఓ అభ్యర్థన చేసింది. సరైన మార్గనిర్దేశనం చేయాల్సిందిగా కోరారు. పిల్లలకు వ్యాక్సినేషన్ జరగలేదు.. కానీ పిల్లల విషయంలో పాఠశాలలు తల్లిదండ్రులను ఎందుకు బలవంతం చేస్తున్నాయని అడిగారు.
Also read: ఐక్యరాజ్యసమితిలో డైనోసార్ ప్రసంగం.. ఇప్పటికైనా మారాలని ప్రపంచ దేశాలకు మెసేజ్..
undefined
అంతేకాకుండా పిల్లలకు ఏదైనా జరిగితే పాఠశాలల యజమాన్యానికి ఎటువంటి సంబంధం లేదని సంతకాలు తీసుకోవడం ఎంతవరకు సరైనది అని ఆమె ప్రశ్నించారు. ఎప్పటిలాగే ఈ విషయంలో కూడా సరైన మార్గనిర్దేశనం చేస్తారని ఆశిస్తున్నానని.. కేటీఆర్‌కు ట్వీట్ చేశారు.
Also raed: Huzurabad bypoll: ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ ఫిర్యాదులపై ఈసీ ఆరా
‘సార్.. అసలు లాక్‌డౌన్ ఎందుకు వచ్చిందో.. ఆపై అన్‌లాక్ కూడా ఎందుకు వచ్చిందో అందరూ అర్థం చేసుకోవాలి. మనందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి.. కాస్త భరోసా ఉంటుంది. అయితే టీకా వేయాల్సిన వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల సంగతేంటి సార్?.. పాఠశాలలు తల్లిదండ్రులను ఎందుకు బలవంతం చేస్తున్నాయి..?. పిల్లలను స్కూల్‌లో ఉన్నప్పుడు వారికి ఏమైనా జరిగితే వారు బాధ్యత వహించరు అని సంతకం చేసిన డాక్యూమెంట్‌తో పిల్లలను పాఠశాలకు పంపడం.. ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి సార్. ఎప్పటిలాగే ఈ విషయంలో కూడా మీరు సరైన మార్గనిర్దేశం చేస్తారని ఆశిస్తున్నాను. మనమందరం కట్టివేయబడిన స్థితిలో ఉన్నాం’ అని అనసూయ కేటీఆర్‌కు ట్వీట్ చేశారు.
(2/2) to send the children to school with a signed document which says they are NOT responsible if/whatsoever happens to the children while they are at school.. tell me sir.. how fair is this.. hoping you would guide us right as always.. we are all in a fix 🙏🏻
— Anasuya Bharadwaj (@anusuyakhasba)అంతేకాకుండా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని కూడా ట్యాగ్ చేసింది. అయితే ప్రస్తుతం అనసూయ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.