
ఒకప్పటి లవర్ బాయ్ Madhavan ప్రస్తుతం విలక్షణమైన పాత్రల్లో నటిస్తున్నారు. అప్పట్లో మాధవన్ చిత్రాల్లో ప్రేమ పాటలు యువతని పిచ్చెక్కించేవి. సఖి, చెలి లాంటి చిత్రాల్లో సాంగ్స్ ఇప్పటికీ యువతని ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇదిలా ఉండగా మాధవన్ ఓ తండ్రిగా గర్వపడే సమయం వచ్చింది. మాధవన్ తనయుడు వేదాంత్ స్విమ్మింగ్ పోటీల్లో దూసుకుపోతున్నాడు.
ఇటీవల బెంగుళూరులో జరిగిన 47వ జాతీయ అక్వాటిక్ నేషనల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో Vedaant అదరగొట్టాడు. ఏకంగా 7 మెడల్స్ సాధించి అదరగొట్టాడు. అందరి దృష్టిని ఆకర్షించాడు. సోషల్ మీడియాలో వేదాంత్ హాట్ టాపిక్ గా మారడు. తండ్రికి తగ్గ తనయుడు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. వేదాంత్ సాధించిన పతకాల్లో నాలుగు సిల్వర్, మూడు బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి.
మాధవన్ కూడా తన కొడుకు సాధించిన ఘనతలకు పొంగిపోతున్నాడు. ఆ మధ్యన మాధవన్ తన కుమారుడి బర్త్ డే సందర్భంగా ఓ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ లో తన కొడుకుపై ప్రశంసల వర్షం కురిపించాడు మాధవన్. నన్ను అన్ని విషయాల్లో అధికమిస్తున్నందుకు థ్యాంక్స్. నిన్ను చూసి అసూయ పడుతున్నందుకు సంతోషంగా ఉంది అంటూ కామెంట్ చేశాడు.
ఇక 'రహానే హై మేరె దిల్ మైయిన్' చిత్రంలో మాధవన్ తో కలసి నటించిన దియా మీర్జా వేదాంత్ 7 మెడల్స్ సాధించడంపై సోషల్ మీడియాలో స్పందించింది. 'కంగ్రాట్స్ వేదాంత్' అంటూ మాధవన్, వేదాంత్ ఇద్దరూ ఉన్న పిక్ పోస్ట్ చేసింది.
మరి సిమ్మింగ్ లోనే వేదాంత్ కొనసాగుతాడా లేక భవిష్యత్తులో నటనవైపు వస్తాడా అనేది చూడాలి. మాధవన్ తరహాలోనే వేదాంత్ కూడా హ్యాండ్సమ్ లుక్ లో కనిపిస్తున్నాడు.