RRR Big Breaking: గత్యంతరం లేక `ఆర్‌ఆర్‌ఆర్‌` వాయిదా.. షాక్‌లో అభిమానులు

Published : Jan 01, 2022, 05:38 PM ISTUpdated : Jan 01, 2022, 05:44 PM IST
RRR Big Breaking: గత్యంతరం లేక `ఆర్‌ఆర్‌ఆర్‌` వాయిదా.. షాక్‌లో అభిమానులు

సారాంశం

పలు రాష్ట్రాల్లో థియేటర్లు క్లోజ్‌ అవుతున్నాయి. దీంతో గత్యంతరం లేక వాయిదా వేస్తున్నట్టు RRR Movie నిర్మాత ప్రకటించారు. సినిమాని సరైన సమయంలో విడుదల చేస్తామని వెల్లడించారు.

ఊహించినట్టే అయ్యింది. ఇండియన్‌ ఆడియెన్స్ ఎంతో ఆతృతగా వెయిట్‌ చేస్తున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా వాయిదా పడింది. తాజాగా చిత్ర నిర్మాతలు సినిమాని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం నెలకొన్న క్లిష్టపరిస్థితుల్లో సినిమాని విడుదల చేయడం సాధ్యం కాని పరిస్థితుల్లో వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు. `అన్ని రకాల అంశాలను దృష్టిలో పెట్టుకుని `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమాని వాయిదా వేయాలని నిర్ణయించామని తెలిపింది `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌. సినిమాని ఎంతగానే ప్రేమిస్తున్న ఆడియెన్స్ కి ధన్యవాదాలు తెలిపింది.  సినిమాని ఆడియెన్స్ ముందుకు తీసుకురావాలని ఎంతో ప్రయత్నించామని, కానీ కొన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండవని, ఇండియాలోని పలు రాష్ట్రాల్లో థియేటర్లు క్లోజ్‌ అవుతున్నాయి. దీంతో గత్యంతరం లేక వాయిదా వేస్తున్నట్టు నిర్మాత ప్రకటించారు. సినిమాని సరైన సమయంలో విడుదల చేస్తామని వెల్లడించారు.

కరోనా దెబ్బకి థియేటర్లు మూతబడుతున్నాయి. కేరళా, తమిళనాడు, మహారాష్ట్రలో యాభై శాతం కెపాసిటీతో సినిమా థియేటర్లని రన్ చేయాలని ప్రభుత్వాలు ఆంక్షలు పెట్టాయి. ఢిల్లీలో ఏకంగా థియేటర్లని మూసేస్తున్న ప్రభుత్వం వెల్లడించింది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతుండటం, ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు జనం గుమిగూడే విభాగాలైన థియేటర్లపై ఆంక్షలు పెంచాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో `ఆర్‌ఆర్‌ఆర్‌` వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. 

`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమాని వాయిదా వేసుకోవడానికి కారణం.. ఇది పాన్‌ ఇండియా సినిమా. దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. దేశ వ్యాప్తంగా పదికిపైగా భాషల్లో సినిమాని విడుదలకు ప్లాన్‌ చేశారు. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు నిర్వహించారు. హిందీలో, తమిళనాడులో పూర్తి చేసుకుని ప్రస్తుతం కేరళాలో ప్రమోషన్‌లో బిజీగా ఉంది. ఆ తర్వాత బెంగుళూరు, తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్‌ చేయాల్సి ఉంది. జనవరి 7న భారీగా రిలీజ్‌కి ప్లాన్‌ చేశారు. ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ స్థాయిలో రిలీజ్‌ ఉండాల్సిందే. వెయ్యి కోట్ల కలెక్షన్ల టార్గెట్‌తో బరిలోకి దిగింది `ఆర్‌ఆర్‌ఆర్‌`. కానీ ఆ స్థాయి కలెక్షన్లు రావాలంటే ప్రస్తుతం కరోనా ఆంక్షల నేపథ్యంలో సాధ్యం కాదు. అంతేకాదు బడ్జెట్‌ డబ్బులు కూడా రావడం కష్టంగా మారిన నేపథ్యంలో `ఆర్‌ఆర్‌ఆర్‌`ని వాయిదా వేసుకోవాలని నిర్ణయంచుకున్నారు. 

`ఆర్ఆర్‌ఆర్‌` చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించగా, రాజమౌళి దర్వకత్వం వహించారు. కొమురంభీమ్‌, అల్లూరి సీతారామరాజు యంగ్‌ ఏజ్‌లో చేసిన పోరాటం నేపథ్యంలో ఈ చిత్రం సాగబోతుంది. డివివి దానయ్య ఏకంగా నాలుగు వందల యాభై కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. అలియాభట్‌, ఒలివియా మోర్రీస్‌ హీరోయిన్లుగా, అజయ్‌ దేవగన్‌, శ్రియా, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జనవరి 7న విడుదల చేయాలని భావించారు. కానీ ఇప్పుడు వాయిదా వేసిన విషయం తెలిసిందే. 

also read: RRR Postpone: అద్భుతమైన ఛాన్స్‌ ని మిస్‌ చేసుకున్న చిరంజీవి, పవన్‌.. జాక్‌పాట్‌ కొట్టిన నాగ్‌?

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!