Jersey heroine Mrunal Thakur: జెర్సీ హీరోయిన్ కి కోవిడ్ పాజిటివ్..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 01, 2022, 03:09 PM IST
Jersey heroine Mrunal Thakur: జెర్సీ హీరోయిన్ కి కోవిడ్ పాజిటివ్..

సారాంశం

ముంబైలో కోవిడ్ కేసులు అంతకంతకూ పెరుగుతుండడంతో బాలీవుడ్ సెలెబ్రిటీలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ అర్జున్ కపూర్, శిల్పా శిరోద్కర్, నోరా ఫతేహి లాంటి సెలెబ్రిటీలు కరోనా బారిన పడ్డారు.

ముంబైలో కోవిడ్ కేసులు అంతకంతకూ పెరుగుతుండడంతో బాలీవుడ్ సెలెబ్రిటీలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ అర్జున్ కపూర్, శిల్పా శిరోద్కర్, నోరా ఫతేహి లాంటి సెలెబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా హిందీ జెర్సీ చిత్ర హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ని కూడా కరోనా వైరస్ తాకింది. 

తనలో వైరస్ లక్షణాలు కనిపించడంతో ఆమె టెస్ట్ చేయించుకున్నారు. దీనితో మృణాల్ ఠాకూర్ కి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. 

'నాకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇప్పటికైతే కొద్దిపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయి. పెద్దగా సమస్య లేదు. కానీ వైద్యుల సలహాతో ఐసొలేషన్ లో ఉన్నాను. వైద్య నిపుణుల సలహాలు పాటిస్తున్నాను. ఇటీవల నన్ను కలసిన వాళ్ళు తప్పకుండా కోవిడ్ టెస్ట్ చేయించుకోండి. జాగ్రత్తగా ఉండండి' అని మృణాల్ ఠాకూర్ పోస్ట్ పెట్టింది. 

టాలీవుడ్ లో కూడా హీరో మంచు మనోజ్, విశ్వక్ సేన్ కరోనా బారిన పడ్డారు. దేశంలో రోజు రోజుకు కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా అంతకంతకు ఎక్కువవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 

హరోయిన్ మృణాల్ ఠాకూర్ జెర్సీ చిత్రంలో షాహిద్ కపూర్ కి జోడిగా నటించింది. తెలుగులో నాని నటించిన జెర్సీ చిత్రాన్ని హిందీలో షాహిద్ రీమేక్ చేస్తున్నారు. హిందీ రీమేక్ డిసెంబర్ 31న విడుదల కావాల్సింది. దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు, ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ, థియేటర్స్ పై ఆంక్షల నేపథ్యంలో ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. ఒరిజినల్ వర్షన్ తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని రూపొందించారు. 

Also Read: HBD Vidyabalan: డర్టీ పిక్చర్ బ్యూటీని ఇలా ఎప్పుడైనా చూశారా.. సునామీ సృష్టిస్తున్న హాట్ ఫోటోస్

PREV
click me!

Recommended Stories

Ameesha Patel: నాలో సగం ఏజ్‌ కుర్రాళ్లు డేటింగ్‌కి రమ్ముంటున్నారు, 50ఏళ్లు అయినా ఫర్వాలేదు పెళ్లికి రెడీ
Bigg Boss telugu 9 లో మిడ్ వీక్ ఎలిమినేషన్, ఆ ఇద్దరిలో బయటకు వెళ్లేది ఎవరు?