Ram Charan: 100 కోట్ల రెమ్యునరేషన్ పై రాంచరణ్ కామెంట్స్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 01, 2022, 05:02 PM IST
Ram Charan: 100 కోట్ల రెమ్యునరేషన్ పై రాంచరణ్ కామెంట్స్

సారాంశం

ఆర్ఆర్ఆర్ చిత్రం రిలీజ్ కంటే ముందే రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరికి పాన్ ఇండియా క్రేజ్ తీసుకువచ్చింది. ఆర్ఆర్ఆర్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా రాంచరణ్, ఎన్టీఆర్ ఎక్కడకి వెళ్లినా అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. 

ఆర్ఆర్ఆర్ చిత్రం రిలీజ్ కంటే ముందే రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరికి పాన్ ఇండియా క్రేజ్ తీసుకువచ్చింది. ఆర్ఆర్ఆర్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా రాంచరణ్, ఎన్టీఆర్ ఎక్కడకి వెళ్లినా అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. 

ఆర్ఆర్ఆర్ తర్వాత రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరూవరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాంచరణ్ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. 

శంకర్ మార్క్ సందేశంతో పాటు హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు కూడా ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయి. ఈ చిత్రానికి రాంచరణ్ భారీ స్థాయిలో 100 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాధారణంగా టాలీవుడ్ స్టార్ హీరోలు 30 కోట్ల నుంచి 50 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారు. 

పవన్, మహేష్ లాంటి హీరోలు 50 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ప్రభాస్ కి పాన్ ఇండియా క్రేజ్ ఉంది కాబట్టి అతడి రెమ్యునరేషన్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. రాంచరణ్ 100 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడనే వార్త వైరల్ గా మారింది. 

ఆర్ఆర్ఆర్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా రాంచరణ్ కు ఈ ప్రశ్న ఎదురైంది. 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు కదా అని ప్రశ్నించగా.. వంద కోట్లా ఎవరు ఇచ్చారు ? ఎక్కడ ఇచ్చారు.. మీకు తెలిస్తే కాస్త చెప్పండి అని చరణ్ వ్యంగ్యంగా బదులిచ్చాడు. తాను 100 కోట్లు డిమాండ్ చేశాను అనేది పెద్ద జోక్ అని చరణ్ ఆ రూమర్స్ ని కొట్టిపారేశాడు. 

ఇదిలా ఉందా ప్రస్తుతం ఉన్న కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో మరోసారి ఆర్ఆర్ఆర్ చిత్రం వాయిదా పడింది. ఢిల్లీ మహారాష్ట్ర,తమిళనాడు ప్రభుత్వాలు థియేటర్స్ పై ఆంక్షలు విధించాయి. కొన్ని చోట్ల 50 శాతం అంక్యుపెన్సీకి మాత్రమే అనుమతి ఇచ్చారు. దీనితో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. జనవరి 7న విడుదల కావాల్సిన ఆర్ ఆర్ఆర్ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసింది. తదుపరి రిలీజ్ సమ్మర్ లో ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

Also Read: HBD Vidyabalan: డర్టీ పిక్చర్ బ్యూటీని ఇలా ఎప్పుడైనా చూశారా.. సునామీ సృష్టిస్తున్న హాట్ ఫోటోస్ 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Duvvada Srinivas: చీరలమ్మి 7 నెలల్లో 12 కోట్లు సంపాదించా, సక్సెస్ అంటే ఇది
Ramya Krishnan రహస్యం వెల్లడించిన రజినీకాంత్, నీలాంబరి పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ ఎవరో తెలుసా?