రిలీజ్ కు ముందే బాహుబలి రికార్డు బద్ధలు కొట్టిన 2.0

Published : Oct 10, 2017, 03:12 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
రిలీజ్ కు ముందే బాహుబలి రికార్డు బద్ధలు కొట్టిన 2.0

సారాంశం

సూపర్ స్టార్ రజినీ కాంత్, శంకర్ కాంబినేషన్ లో వస్తోన్న రోబో 2.0 రోబోకు సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీకి రూ.400కోట్ల రూపాయలు బడ్జెట్ భారీ బడ్జెట్ తో తెరకెక్కి రిలీజ్ కు ముందే బాహుబలి రికార్డు బద్ధలు కొట్టిన 2.0

తెలుగులో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా అనగానే టక్కున బాహుబలి అంటాం. టాలీవుడ్ లో ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన బాహుబలి  అంతర్జాతీయస్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతిని నలు దిక్కులా చాటి చెప్పింది.  తెలుగు ఇండస్ట్రీలో ఇంత అద్భుతమైన చిత్రాలు వస్తున్నాయా అని అన్ని ఇండస్ట్రీలు చర్చించుకునే స్థాయికి ప్రముఖ దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి తీసుకు వచ్చారు.  అంతే కాదు భారత దేశంలో అత్యధికంగా వసూళ్లు చేసిన చిత్రంగా బాహుబలి 2 రికార్డు నమోదు చేసుకుంది.  వసూళ్ల విషయంలో, బడ్జెట్ వ్యవహారాల విషయంలో ‘బాహుబలి’ తర్వాతే అనిపించుకున్నాయి.

 

‘నాన్ బాహుబలి’ రికార్డ్స్ అనే మాట పుట్టుకు వచ్చింది. బాహుబలి వసూళ్లు, బడ్జెట్ వ్యవహారాలను ఎవరూ టచ్ చేయలేరు అన్న పరిస్థితికి వచ్చింది.  అయితే ఇప్పుడు ఆ రికార్డు బ్రేక్ చేసింది 2.0. రజనీకాంత్ హీరోగా నటించిన ‘రోబో’ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న 2.0 కు సంబంధించి ఇప్పుడు కొత్త రికార్డులకు నాంది పలుకుతుంది.  శనివారం రిలీజ్ అయిన 2.0 మేకింగ్ వీడియో చూస్తుంటే.. హాలీవుడ్ కి ఏమాత్రం తీసిపోని విధంగా అనిపిస్తుంది. 

భారతీయ చలన చిత్ర రంగంలో అత్యంత భారీ బడ్జెట్ సినిమా గా ‘2.0’ నిలుస్తోంది.  అయితే  ‘బాహుబలి’ ‘బాహుబలి-2’ సినిమాల బడ్జెట్ కలిపి 450 కోట్ల రూపాయలు. కానీ  ‘2.0’ విషయంలో సింగిల్ గానే నాలుగు వందల కోట్ల రూపాయలు పెడుతున్నారు. దీంతో.. దేశీయ సినిమాల్లో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఇది తొలి స్థానాన్ని సంపాదించుకుంటోంది.

 

ఈ సినిమాను తమిళ, తెలుగు, హిందీ, మలయాళ భాషలతో పాటు జపాన్, కొరియా, చైనాల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి చిత్రం విడుదల తర్వాత వసూళ్లు ఏ రేంజ్ లో వస్తాయో.. ఎన్ని రికార్డులు కొల్లగొట్టనుందో అని రజినీ ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan Gift: `ఓజీ` దర్శకుడికి పవన్‌ కళ్యాణ్‌ ఊహించని గిఫ్ట్.. సుజీత్‌ ఎమోషనల్‌
9 సినిమాలు చేస్తే.. అందులో 8 ఫ్లాప్‌లు.. పాన్ ఇండియా స్టార్‌పైనే ఆశలన్నీ.. ఎవరీ హీరోయిన్.?