విద్యాబాలన్ ఎదుటే లోకల్ ట్రైన్ లో ఓ యువకుడు హస్తప్రయోగం...!!

First Published Oct 10, 2017, 2:50 AM IST
Highlights
  • బాలీవుడ్ క్రేజీ హిరోయన్స్ లో విద్యాబాలన్ కు చోటు
  • డర్టీ పిక్చచర్ తో బాక్సాఫీస్ ను కొల్లగొట్టేసిన విద్యాబాలన్
  • తాజాగా గతంలో జరిగిన ఓ సంఘటనను గురించి చెప్పిన విద్యా బాలన్

బాలీవుడ్ తార విద్యాబాలన్‌ కు ఎంతటి క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డర్టీ పిక్చర్ మమూవీలో సిల్క్ రోల్ ప్లే చేసిన విద్యాబాలన్ ఆ మూవీ తర్వాత బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది. తనకు ఎదురైన ఓ విచిత్ర సంఘటన గురించి వివరిస్తూ విద్య తన పాత రోజులు గుర్తు చేసుకుంది. తాను కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడు ఎదురైన ఓ ఘటనను మరో బాలీవుడ్ తార నేహా ధూపియా హోస్ట్‌ గా ఉన్న నో ఫిల్టర్ నేహా అనే కార్యక్రమంలో చెప్పింది. కాలేజీ డేస్‌లో ఓ లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న సమయంలో హస్త ప్రయోగానికి పాల్పడిన ఓ యువకుడితో ఘర్షణ పడ్డ ఘటన గురించి చెప్పింది.

 

ఓసారి  నా స్నేహితులతో కలిసి లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్నాను. అప్పుడు నేను జేవియర్ కాలేజీలో చదివేదాన్ని. ముగ్గురు ఫ్రెండ్స్ లేడిస్ కంపార్ట్‌ మెంట్‌లోకి ఎక్కి కూర్చున్నాం. మేము ముచ్చట్లో పడి ఉండగా ఎదురుగా ఓ యువకుడు వచ్చి కూర్చున్నాడు. ఇది లేడీస్ కంపార్ట్‌మెంట్ అని చెప్పాను. అందుకు అచ్చా లేడిస్ కంపార్ట్‌మెంటా అని అయితే వచ్చే స్టేషన్‌లో దిగిపోతాను అని యువకుడు అన్నాడు.

 

అంతలోపే స్టేషన్ వచ్చింది. ఆ యువకుడు లేచి డోర్ వద్దకు వెళ్లాడు. అతడు వెళ్లి పోతాడని మేము అనుకొన్నాం. కానీ రైలు కదలగానే మళ్లీ వచ్చాడు. వచ్చే స్టేషన్‌లో దిగిపోతాను అని మళ్లీ చెప్పాడు. సరే అని వదిలేశాం. కానీ అంతలోనే ఆ యువకుడు దారుణంగా ప్రవర్తించాడు. దాంతో మా మతిపోయింది. అని తెలిపింది.

 

ఇంతకీ ఆ దారుణ ఘటన ఏంటంటే.. తమ ఎదురు సీట్లో కూర్చున్న యువకుడు సర్రున ప్యాంట్ జిప్ కిందకి లాగాడు. వీడు తేడాగాడు అనుకునే లోపే మాకు వాడేం చేస్తున్నాడో అర్థమైంది. మా ఎదుటనే తన అంగాన్ని బయటికి తీసి మా ముందే కావాలని హస్త ప్రయోగం చేయడం ప్రారంభించాడు.

అతని చేష్టలు గమనించి నేను వెంటనే నా చేతిలో ఉన్న రైటింగ్ ప్యాడ్ విసిరి కొట్టాను. వెళ్లి రెండు వాయించాను. అమ్మనా బూతులు తిట్టాను. నడుస్తున్న రైలులో నుంచి తోసేసినంత పనిచేశాను. అతను చేసిన పనికి నేను షేక్ అయ్యానని కోపంతో ఊగిపోయాను అని విద్యాబాలన్ ఓ చేదు అనుభవాన్ని నేహాతో షేర్ చేసుకొన్నారు.

 

ఇలాంటి ఘటనే తనకూ ఎదురైందని అక్షయ్ కుమార్ సతీమణి, ఒకప్పటి అందాల తార ట్వింకిల్ ఖన్నా కూడా చెప్పింది. ముంబైలోని కొలాబాలో అమెరికా మహిళ ముందు ఓ యువకుడు హస్త ప్రయోగానికి పాల్పడటం, అతడిని పోలీసులు అరెస్ట్ చేయడంపై ఇరు అని ట్వింకిల్ ఖన్నా ఇటీవల ఇంటర్వ్యూలో పేర్కొన్నది. మానసిక రోగుల్లాంటి వారే ఇలాంటి చర్యలకు పాల్పడుతారు అని ట్వింకిల్ వ్యాఖ్యానించడం గమనార్హం.

click me!