టాలీవుడ్ కు కొత్త గోల్డెన్ బ్యూటీ దొరికింది

Published : Oct 09, 2017, 07:39 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
టాలీవుడ్ కు కొత్త గోల్డెన్ బ్యూటీ దొరికింది

సారాంశం

టాలీవుడ్ లో మరో కొత్త హీరోయిన్ హవా మెహరిన్ రూపంలో మరో గోల్టెన్ లెగ్ వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న మెహ్రీన్ కౌర్

వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతోన్న అందాల భామ మెహ‌రిన్‌ రూపంలో ఇప్పుడు టాలీవుడ్‌కి కొత్త గోల్డెన్ గ‌ర్ల్ దొరికింది.  నాని హీరోగా కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన పంజాబీ భామ మెహరిన్. ఆ సినిమాలో మెహ‌రిన్ అంద‌చందాల‌తో పాటు అభిన‌యానికి టాలీవుడ్ ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ఆ సినిమా త‌ర్వాత కాస్త లాంగ్ గ్యాప్ తీసుకున్న మెహ‌రిన్ మ‌ధ్య‌లో బాలీవుడ్‌లోకి వెళ్లింది. అక్క‌డ ఫిలౌరి సినిమాలో న‌టించింది.

తాజాగా మెహరీన్ కు తెలుగులో వ‌రుస‌గా ఛాన్సులు వచ్చేస్తున్నాయి. ఇటీవలే ద‌స‌రా పండగ కానుకగా ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి పెద్ద హీరోల సినిమాల‌కు పోటీగా... వ‌చ్చిన మ‌హానుభావుడు బంపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో మెహ‌రిన్ న‌ట‌న‌కు తెలుగు ప్రేక్షకులు ఫ్లాట్ అయిపోయారు. ఇక దీపావ‌ళి రోజు రాజా ది గ్రేట్‌తో మ‌రోసారి థియేట‌ర్ల‌లో క‌నువిందు చేసేందుకు రెడీ అవుతోంది మెహరీన్.

ఈ మూవీ తర్వాత మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ జ‌వాన్ సినిమా, ఆ త‌ర్వాత కేరాఫ్ సూర్య లాంటి క్రేజీ మూవీ కూడా రానుంది. ఇక విడుద‌లైన రెండు సినిమాల్లోను అందం,అభిన‌యం అన్నీ కలగలిపి తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌స్సు దోచేసిన ఈ అమ్మ‌డు.... ఇప్పుడు రాజా ది గ్రేట్ సినిమా ట్రైల‌ర్‌ లో కనిపిస్తున్న తీరు చూస్తుంటే...  న‌ట‌న‌తో పాటు గ్లామ‌ర్ డోస్ కూడా బాగానే పెంచేసిన‌ట్టు క‌న‌ప‌డుతోంది. రాజా ది గ్రేట్ సినిమాతో ఆమెకు హ్యాట్రిక్ హిట్ కొట్టిన‌ట్టే అన్న టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది.

 

ఇప్పుడు మెహ‌రిన్‌పై అగ్ర‌హీరోల క‌న్ను ప‌డింది. వీళ్లంతా వ‌రుస‌గా త‌మ సినిమాల్లో ఛాన్సులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో కాజల్ - సమంత - తమన్నా - రకుల్ లాంటి స్టార్ హిరోయిన్ల జోరు తగ్గడంతో వారిని మెహరిన్ రీప్లేస్ చేస్తుందనే టాక్ నడస్తోంది. టాలీవుడ్‌కు మెహ‌రిన్ రూపంలో మ‌రో గోల్డెన్ గ‌ర్ల్ దొరికింద‌న్న ప్ర‌చారం హీరోల‌తో పాటు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల స‌ర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది.

PREV
click me!

Recommended Stories

Nagarjuna తో పోటీకి దిగి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లరి నరేష్, ఇంతకీ ఆమూవీ ఏదో తెలుసా?
Savitri: మహానటి జీవితం నాశనం కావడానికి జెమినీ గణేషన్‌, పొలిటీషియన్‌ మాత్రమే కాదు, ఆ మూడో వ్యక్తి ఇతడేనా?