అరవింద సమేతపై డిబేట్ కోసం వెళ్తూ...: ఒకరి మృతి

By sivanagaprasad kodatiFirst Published Oct 17, 2018, 7:59 AM IST
Highlights

త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘‘ అరవింద సమేత వీరరాఘవ’’ సినిమాలో రాయలసీమ అస్థిత్వాన్ని, యాస, భాషలను అవమానించారంటూ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. 

కర్నూలు: ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమాపై టీవీ చానెల్ డిబేట్ లో పాల్గొనడానికి వెళ్తూ రాయలసీమ యువకులు ప్రమాదానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని, ఫొటోలను హరినాథ్ రెడ్డి అప్పిరెడ్డి అనే వ్యక్తి ఫేస్ బుక్ లో షేర్ చేశారు. వాళ్లంతా 30 ఏళ్ల వయస్సు దాటని యువకులే

నిరంతరం రాయలసీమ సమస్యలపై జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు.  "అరవింద సమేత వీర రాఘవ" సినిమాలో రాయలసీమ భాష, జీవితాల్ని కించపరచడాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాదులో మంగళవారం ప్రెస్ మీట్ ను నిర్వహించారు. 

అదే రోజు ఓ టీవీ చానెల్ లో రాయలసీమ ప్రాంతాన్ని సినిమాలలో అవమానించడాన్ని వ్యతిరేకిస్తూ డిబేట్ లో పాల్గొన్నారు. బుధవారం సాయంత్రం మరో టీవీ వారి ఆహ్వానం మేరకు డిబేట్ లో పాల్గొనడానికి రాయలసీమ నుండి హైదరాబాదు బయలు దేరారు. 

తుంగభద్ర దాటి కొంత ప్రయాణం సాగింది. హఠాత్తుగా హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదంలో వారి వాహనం నుగ్గయింది. ఈ ప్రమాదంలో జలం శ్రీను అనే యువకుడు తుదిశ్వాస విడిచారు. శ్రీను బ్రాహ్మణకొట్కూరు నివాసి. కర్నూలులో స్థిరపడ్డాడు. 

బహుజన ఉద్యమంతో పాటు సీమ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నారు.  ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారిలో కృష్ణ నాయక్, (అవుకు మండలం, కర్నూలు జిల్లా, కాగా అనంతపురంలో ప్రస్తుతం ఉంటున్నారు), రవికుమార్ (కర్నూలు), వి.వి నాయుడు (కర్నూలు), రాజశేఖరరెడ్డి (గుత్తి), మొదలైనవారు ఉన్నారు.

 

అరవింద బుక్ మై షోని కూడా వదల్లేదు!

'అరవింద సమేత'.. రెడ్డెమ్మ తల్లి కవర్ వెర్షన్ సాంగ్!

అరవింద సమేతపై ఆరోపణలు.. గంటకే ఫేస్ బుక్ పోస్ట్ డిలీట్!

'అరవింద సమేత'పై సీమ ఆగ్రహం!
 

click me!