బాలీవుడ్ కాంచనలో అక్షయ్ కుమార్?

Published : Oct 16, 2018, 09:14 PM IST
బాలీవుడ్ కాంచనలో అక్షయ్ కుమార్?

సారాంశం

రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంచన: ముని 2 ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. హారర్ కామెడీ నేపథ్యంలో వచ్చిన ఆ సినిమా మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. 

రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంచన: ముని 2 ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. హారర్ కామెడీ నేపథ్యంలో వచ్చిన ఆ సినిమా మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. బయ్యర్స్ కు కాసుల వర్షాన్ని కురిపించింది. ఇకపోతే ఆ సినిమాను ఇప్పుడు హిందీలో రీమేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 

అయితే కథానాయకుడిగా అక్షయ్ కుమార్ కనిపించనున్నట్లు సమాచారం. సౌత్ సినిమాలను అప్పుడపుడు రీమేక్ చేసే అక్షయ్ మంచి హిట్స్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు హారర్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కాంచన సినిమాలో రాఘవ నట విశ్వరూపం చూపించాడు. ఆ స్థాయిలో అక్షయ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది అందరిలో ఆసక్తిని రేపుతోంది. 

కాంచన సినిమాలో శరత్ బాబు చేసిన హిజ్రా పాత్ర కూడా ప్రధానమైంది. అప్పట్లో ఆయన ఆ పాత్ర చేస్తున్నారు అనగానే ఏ మాత్రం సెట్ అవ్వదని విమర్శలు వచ్చాయి. కానీ లారెన్స్ పట్టుబట్టి శరత్ బాబును ఆ పాత్ర ను ఛాలెంజింగ్ గా చేయించారు. సినిమా రిలీజ్ అనంతరం అందరికి ఆ పాత్రే ఎక్కువగా హార్ట్ ని టచ్ చేసింది. మరి ఇప్పుడు బాలీవుడ్ లో ఆ పాత్రను ఎవరు చేస్తారో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?