
మహిళా దినోత్సవం సందర్భంగా ఇటీవలే ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్. తన పిల్లలను చూసుకోవడంలో పవన్ కు 10కి 100 శాతం మార్కులు వేస్తానంటున్న రేణు దేశాయ్ భర్తగా పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన మార్కులు షాకింగ్.
మహిళా దినోత్సవం నాడు రిలీజ్ కానున్న ఆ ఇంటర్వ్యూలో రాపిడ్ ఫైర్ కు రేణు చాలా స్వీడుగా ఆన్సర్ చేయగా.. వాటిలో ఎక్కువ ప్రశ్నలు తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ కు చెందినవే. ఆ ఇంటర్వూలో భాగంగా... తనకు ఎంతో ఇష్టమైన ప్రదేశం మిలాన్ అని చెప్పిన రేణూ దేశాయ్.. బాలు సినిమా షూటింగ్ సందర్భంగా అక్కడ ఎన్నో ప్రదేశాలను పవన్ కళ్యాణ్ తో కలిసి తిరిగినట్లు చెప్పింది.
తన పెళ్లి గురించి ఆసక్తికర కమెంట్ చేసింది రేణు దేశాయ్. అసలు పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేశానని అంటోంది. తాను ఎంతో త్వరగా నిర్ణయాలు తీసుకుంటానని.. తన జీవితంలో పెళ్లి చేసుకోవడం అతి తొందరపాటు నిర్ణయంగా చెప్పింది రేణూ దేశాయ్. ఒక భర్తగా అయితే పవన్ కు 4-5 మార్కులే వేస్తానని చెప్పిన రేణు దేశాయ్.. తండ్రిగా అయితే పవన్ కళ్యాణ్ కు పదికి వంద మార్కులు వేస్తానంది.
పవన్ కళ్యాణ్ కు ఫిలిం యాక్టర్ గా పదికి పది మార్కులు వేసిన రేణు దేశాయ్.. పొలీటీషియన్ గానూ పవన్ కు పదికి పది మార్కులు వేస్తానంది. తను రాజకీయాల్లో ఏ మేరకు ఎదుగుతాడో చెప్పలేనని, అయితే ప్రజల పట్ల, సమస్యల పట్ల ఆయన చిత్తశుద్ధి ఏంటో తనకు తెలుసని రేణుదేశాయ్ కితాబిచ్చారు.
ఇక తమ కొడుకు అకీరాతో పవన్ సినిమాల్లో ఏదో ఒకదాన్ని రీమేక్ చేయాల్సి వస్తే.. ఖుషీ మూవీని ఎంచుకుంటానని చెప్పింది రేణూ. అయితే.. పవన్ సినిమాల్లోంచి ఒకటి తను రీమేక్ చేస్తే మాత్రం జానీ మూవీని ఎంచుకుంటానని.. ఒరిజినల్ స్టోరీ వేరన్న ఆమె.. మేకింగ్ లో కమర్షియల్ వేల్యూస్ కోసం కథను చాలా మార్చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. జానీ కథను యాజిటీజ్ గా తీస్తే హిట్ అయ్యేదేమోనని రేణు అభిప్రాయపడ్డారు.