చరణ్ ను పక్కన బెట్టేసిన పవన్ కళ్యాణ్

Published : Mar 06, 2017, 07:54 AM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
చరణ్ ను  పక్కన బెట్టేసిన పవన్ కళ్యాణ్

సారాంశం

తను నిర్మించనున్న సినిమాలో చరణ్ హీరో అని గతంలో చెప్పిన పవన్ ఇప్పుడు రూటు మార్చి చరణ్ స్థానంలో సాయిధరమ్ తేజ్ ను ఫిక్స్ చేసిన పవన్ ధరమ్ తేజ్ ను కెరీర్ లో నిలబెట్టాలని సపోర్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టాక పొలిటికల్ గా ఫుల్ బిజీ అయిపోయారు. అయితే... సినిమాల్లో నటిస్తూ.. ఇటు సినిమా రంగంలో కూడా బిజీగా ఉన్నారు. ఇలా ఓ వైపు నటుడుగా సినిమాలు చేస్తూనే, మరో ప్రక్కన పొలిటికల్ కమిటిమెంట్స్ తోనూ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ త్వరలో నిర్మాతగా కూడా అవతారమెత్తనున్నది తెలిసిందే. తన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి నితిన్, కృష్ణ చైతన్య చిత్రం ఇప్పటికే మొదలెట్టిన పవన్ తన తదుపరి చిత్రానికి కూడా రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

పవన్ , త్రివిక్రమ్ బ్యానర్ లో వచ్చే తదుపరి చిత్రం సాయి ధరమ్ తేజతో ఉండనుందని తెలుస్తోంది. గతంలో రామ్ చరణ్ తో సినిమా చేస్తానని ప్రకటించిన పవన్ ఇలా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజని సీన్లోకి తీసుకు రావటం మెగా క్యాంప్ లో చర్చనీయాంశమైంది. మొదట రామ్ చరణ్ తో సినిమా అనుకున్నా...సాయి ధరమ్ తేజ వరుస ఫ్లాఫ్ లతో ఇబ్బంది పడుతుండటంతో ఆందోళన చెందిన పవన్ చరణ్ ను తప్పించి సాయి ధరమ్ తేజను సీన్లోకి దించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. మొదటి నుంచీ సాయి ధరమ్ తేజ ని నిలబెట్టేందుకు పవన్ తన వంతు కృషి చేస్తూ వస్తున్నారు. అయితే ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు, బడ్జెట్ ఎంత అనే విషయాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

 

ఇక పవన్ తాజా చిత్రం 'కాటమరాయుడు' సాంగ్ రిలీజ్ అయ్యి దుమ్ము రేపుతోంది అయింది. 'రాయుడూ..' అంటూ ఇటీవల టీజర్‌తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'మిరామిరా మీసం.. మెలి తిప్పాడు జన కోసం' అంటూ సాగే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పంచె కట్టి, చేతిలో కత్తిపట్టి, మీసం మెలేసి రంగంలోకి దిగిన 'కాటమరాయుడు' జనం కోసం ఏం చేశాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే అనే ఆసక్తిని ఆ సాంగ్ రేపుతోంది.

PREV
click me!

Recommended Stories

చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?
Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?