మెగాస్టార్ పై రూమర్ ను ఖండించిన జక్కన్న

Published : Mar 06, 2017, 08:35 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
మెగాస్టార్ పై రూమర్ ను ఖండించిన జక్కన్న

సారాంశం

బాహుబలి సినిమాపై పెరుగుతున్న రూమర్స్ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మరింత క్రేజ్ క్రేజు మూలంగా బాహుబలిపై క్రేజీ రూమర్స్ మెగాస్టార్ పై వచ్చిన రూమర్ ఖండించిన రాజమౌళి

బాహుబలి అన్న పదం వినిపిస్తే చాలు.. దాని గురించి కాసేపు చర్చించకుండా ఉండట్లేదు ఎవ్వరూ. ఇప్పుడు బాహుబలి రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో...బాహుబలి గురించి వీలైనన్ని రూమర్స్ కూడా పుడుతున్నాయి. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ ప్రచారంలోకి రావడంతో... అది ఎలాంటి దుమారం లేపుతుందోనని ఆందోళనపడ్డ రాజమౌళి... దాన్ని ఖండిస్తూ వెంటనే ట్వీట్ చేశాడు.

బాహుబలి రూమర్స్ లో ప్రముఖంగా వినిపించిన వాటిలో కొన్ని రోజుల క్రితం బాహుబలి చిత్రంలో షారుక్ నటిస్తున్నాడంటూ వచ్చిన వార్తలు సంచలనం సృష్టించాయి. అయితే... బాహుబలి టీం వాటిని ఖండించింది. షారుఖ్ ఖాన్ నటించే అవకాశమే లేదని స్పష్టం చేశాడు రాజమౌళి.

 

తాజాగా బాహుబలి చిత్రానికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి పై కూడా ఓ రూమర్ ప్రచారంలోకి రావడంతో... ఏ మాత్రం లేట్ చేయకుండా దాన్ని ఖండించాడు దర్శకుడు రాజమౌళి. 'బాహుబలి-2' సినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇస్తున్నారంటూ వార్తలు రావడంతో దర్శకుడు రాజమౌళి వెంటనే స్పందించారు. "బాహుబలి-2కు చిరంజీవి గారు వాయిస్ ఓవర్ ఇస్తున్నారన్నది ఫాల్స్ న్యూస్" అని ట్విట్టర్ ఎకౌంట్ లో పోస్ట్ చేశాడు. 

 

బాహుబలి-2 విషయంలో ఏదైనా రూమర్స్ వస్తే నెమ్మదిగా స్పందించే టీం... మెగాస్టార్ చిరంజీవి గురించిన రూమర్ రావడంతో వెంటనే అలర్ట్ అయింది. ఇదో పెద్ద ఇష్యూ కాకూడదని... రాజమౌళి వెంటనే స్పందించాడు.

 

PREV
click me!

Recommended Stories

Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?
Kalyan Padala Winner: కామన్ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం