
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాటలో నడుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్.. స్టార్ మాలో ప్రసారమౌతున్న రియాల్టీ షో ‘బిగ్ బాస్’ కి హోస్టుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసందే. ఆ బిగ్ బాస్ షో.. మరో రెండు వారాల్లో పూర్తి కానుంది. ఆ తర్వాత.. ఓ డ్యాన్స్ రియాల్టీ షోని ప్రసారం చేసేందుకు స్టార్ మా ఏర్పాట్లు చేస్తోంది.
అయితే.. ఈ డ్యాన్స్ రియాల్టీ షోకి రేణుదేశాయ్ హోస్టుగా వ్యవహరించనున్నారు. పవన్ కల్యాణ్ తో వివాహం అయిన తర్వాత సినిమాల్లో నటించడానికి రేణు.. స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. తర్వాత కొన్ని కారణాలతో ఆమె పవన్ తో విడిపోయారు. ఆ తర్వాత తన పిల్లల ఆలనా పాలనా చూస్తూనే ఓ సినిమాకి దర్శకత్వం వహించారు.
తాజాగా డ్యాన్స్ షోకి హోస్టుగా వ్యవహరించేందుకు అంగీకరించారు. మరి నటిగా, ఓ తల్లిగా తనను తాను నిరూపించుకున్న రేణు.. హోస్టుగా ఎంత వరకు నిరూపించుకుంటారో చూడాలి.