‘శ్రీనివాసుడి’గా తారక్?

Published : Sep 09, 2017, 04:54 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
‘శ్రీనివాసుడి’గా తారక్?

సారాంశం

త్వరలో జైలవకుశ తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఎన్టీఆర్ దిల్ రాజు నిర్మాణంలో కొత్త సినిమా అంగీకరించిన తారక్ సినిమా పేరు ‘శ్రీనివాస కల్యాణం’ గా టాక్

గత కొంత కాలంగా దిల్ రాజు పట్టిందల్లా బంగారమౌతోంది. ఆయన నిర్మిస్తున్ని చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్లుగా నిలుస్తున్నాయి. ఈ ఏడాది ‘శతమానం భవతి’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఆయన త్వరలోనే దర్శకుడు సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో మరో సినిమా తీయడానికి సిద్ధమౌతున్నారు. ఆ చిత్రానికి ‘శ్రీనివాస కల్యాణం’ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

 

 అయితే... ఈ సినిమాలో హీరోగా మొదట చాలా మంది పేర్లు వినిపించినా... తర్వాత ఎన్టీఆర్ ఒకే చెప్పినట్లు టాలివుడ్ టాక్. ప్రస్తుతం జైలవకుశ తో బిజీగా ఉన్న తారక్.. తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నారు. ఆ తర్వాత ఈ సినిమా పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నయి.

 

బృందావనం తరహాలో ఈ సినిమా ఉంటుందని.. తారక్ ని ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత చేరువు చేసేలా ఈ చిత్రం ఉంటుందని టాక్. శ్రీనివాసుడిగా తారక్ కనిపిస్తే.. ఆయనను కల్యాణమాడే లక్ష్మిగా ఎవరు కనిపిస్తారో చూడాలి. తను నటించే ప్రతి సినిమా పాత్రలోను వైవిధ్యం ప్రదర్శిస్తూ జూనియర్ పరుగులు తీస్తున్న వైనం టాప్ హీరోలను ఖంగారు పెడుతోంది అని అంటున్నారు.. 

PREV
click me!

Recommended Stories

Hema Malini House: 54 ఏళ్ల హేమమాలిని ఇల్లు.. లోపలంతా ధర్మేంద్ర జ్ఞాపకాలే!
Student Movie Teaser: శ్రీహరి కొడుకు అదరగొట్టేశాడుగా.. 'స్టూడెంట్' మూవీ టీజర్ వచ్చేసింది