అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ‘దృష్టి’

Published : Sep 09, 2017, 04:14 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ‘దృష్టి’

సారాంశం

రాహుల్ రవీంద్రన్ హీరోగా ‘దృష్టి’ సినిమా సమంత విడుదల చేసిన దృష్టి ఫస్ట్ లుక్ ఫస్ లుక్ కి ట్రెమండరస్ రెస్పాన్స్ 

అందాల రాక్షసి ఫేం రాహుల్ రవీంద్రన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘దృష్టి’. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని సినీ నటి సమంత విడుదల చేశారు.  ఈ ఫస్ట్ లుక్ కి రెస్పాన్స్ బాగా వస్తోందని చిత్ర బృందం చెబుతోంది. ఎమ్ స్వేర్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. రాహుల్ సరసన పావని గంగి రెడ్డి నటిస్తుండగా.. వెన్నెల కిశోర్, సత్య ప్రకాష్, రవి వర్మ, ప్రమోదినీ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.

 

ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని సమంత విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వస్తోందని.. రాహుల్ ని ఇంతకముందెన్నడూ చూడని కోణంలో చూపించనున్నట్లు వారు చెప్పారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోందన్నారు. త్వరలోనే ప్రీరిలీజ్ ఈవెంట్ చేసి.. వెంటనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు.

  

PREV
click me!

Recommended Stories

Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు
Emmanuel కి బిగ్‌ బాస్‌ తెలుగు 9 ట్రోఫీ మిస్‌ కావడానికి కారణం ఇదే.. చేసిన మిస్టేక్‌ ఏంటంటే?