అమితాబ్‌ బచ్చన్‌ `కేబీసీ` షోలో రియల్‌ హీరో.. గెస్ట్ గా సోనూసూద్‌ సందడి

By Aithagoni RajuFirst Published Nov 10, 2021, 4:11 PM IST
Highlights

 అమితాబ్‌ వ్యాఖ్యాతగా ప్రస్తుతం హిందీలో `కేబీసీ 13` వ సీజన్‌ రన్‌ అవుతుంది. ఇది చివరి దశకు చేరుకుంది. క్లోజింగ్‌ సెర్మనీలో భాగంగా రియల్‌ హీరో సోనూ సూద్‌ సందడి చేశారు. 

అమితాబ్‌ బచ్చన్‌ ( Amitabh Bachchan) హోస్ట్ గా నిర్వహిస్తున్న `కౌన్‌ బనేగా కరోడ్‌ పతి`(కేబీసీ) (KBC)షో ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. ఇండియన్‌ రియాలిటీ షోలో ఇదొక గొప్ప కార్యక్రమంగా అందరి చేత ప్రశంసలందుకుంది. ప్రస్తుతం ఇది తెలుగులోనూ రన్‌ అవుతుంది. నాల్గో సీజన్‌ ఎన్టీఆర్‌ హోస్ట్ గా చేస్తున్నారు. మొదటి రెండు షోలకు నాగార్జున హోస్ట్ చేయగా, మూడో షోకి చిరంజీవి వ్యాఖ్యాతగా నిర్వహించారు. ప్రస్తుతం నాల్గో సీజన్‌కి ఎన్టీఆర్‌ హోస్ట్ చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే అమితాబ్‌ వ్యాఖ్యాతగా ప్రస్తుతం హిందీలో `కేబీసీ 13` (KBC 13)వ సీజన్‌ రన్‌ అవుతుంది. ఇది చివరి దశకు చేరుకుంది. క్లోజింగ్‌ సెర్మనీలో భాగంగా రియల్‌ హీరో సోనూ సూద్‌(Sonu Sood) సందడి చేశారు. గెస్ట్ గా ఆయన బిగ్‌బీ షోలో పాల్గొన్నారు. ఇందులో ప్రముఖ హిందీ యాంకర్‌ కపిల్‌ శర్మ కూడా పాల్గొనడం విశేషం. వీరిద్దరు అమితాబ్‌తో కలిసి సందడి చేయగా, ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. ఈ గురువారంతో ఈ సీజన్‌ని ముగించనున్నారట. అందులో భాగంగా గెస్ట్ గా Sonu Sood ఆహ్వానించినట్టు తెలుస్తుంది. 

అయితే ఇందులో సోనూసూద్‌కి గిఫ్ట్ ఇచ్చాడు కపిల్‌ శర్మ. గివ్స్ పేరుతో ఓ టీ షర్ట్ ని బహుకరించారు. అదే సమయంలో ఇందులో అమితాబ్‌ బచ్చన్‌..సోనూ సూద్‌ సేవలని కొనియాడారు. కరోనా ఫస్ట్ వేవ్‌, కరోనా సెకండ్‌ వేవ్‌ టైమ్‌లో సోనూ సూద్‌ చేసిన సేవలను ప్రశంసించారు. అపరిమితమైన సేవా కార్యక్రమాలను ఆయన అభినందించారు. విశేషమైన సేవా కార్యక్రమాలతో జనం గుండెల్లో నిజమైన హీరోగా నిలిచిపోయారని బిగ్‌బీ అభినందించడం విశేషం. 

సోనూసూద్‌ కరోన ఫస్ట్ వేవ్‌ సమయంలో వలస కార్మికులను భోజనాలు పెట్టి సురక్షితంగా వారి స్వస్థలాలకు పంపించారు. ప్రత్యేక రైళ్లు, బస్సులు ఏర్పాటు చేసి వేరే రాష్ట్రాలకు వలస కార్మికులను పంపించి తన గొప్ప మనసుని చాటుకున్నారు. మరోవైపు సెకండ్‌ వేవ్‌ సమయంలో కరోనా రోగులకు ఆసుపత్రుల్లో బెడ్స్ అందించడంతోపాటు ఆక్సిజన్‌ అందించడం, వెంటిలేటర్స్ అందించడం విషయంలో ఆయన తన వంతు సహాయాన్ని అందించారు. వైద్యం అందించడం కోసం ప్రత్యేకమైన ఫ్లైట్స్‌ ద్వారా రోగులను తరలించడం విశేషం. రోగుల ప్రాణాలను కాపాడేందుకు సోనూ సూద్‌ విశేషంగా కృషి చేశారు. ఇదిలా ఉంటే ఇటీవల ఆయన ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇది పెద్ద దుమారం రేపింది. 

also read: Poonam pandey: పూనమ్ పాండేను తీవ్రంగా గాయపరిచిన భర్త సామ్ బాంబే అరెస్ట్!
 

click me!