RRR Movie: 'నాటు నాటు' లిరికల్ సాంగ్.. బ్రిటిష్ కోటలో చరణ్, ఎన్టీఆర్ దుమ్ములేపే స్టెప్పులు

pratap reddy   | Asianet News
Published : Nov 10, 2021, 03:34 PM ISTUpdated : Nov 10, 2021, 03:36 PM IST
RRR Movie: 'నాటు నాటు' లిరికల్ సాంగ్.. బ్రిటిష్ కోటలో చరణ్, ఎన్టీఆర్ దుమ్ములేపే స్టెప్పులు

సారాంశం

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం). దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో విజువల్ వండర్ ఈ మూవీ. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం). దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో విజువల్ వండర్ ఈ మూవీ. జనవరి 7న రిలీజ్ కు రెడీ అవుతుండడంతో చిత్ర యూనిట్ భారీ ప్రచార కార్యక్రమాలు షురూ చేసింది. కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన గ్లింప్స్ వీడియోకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 

తాజాగా RRR చిత్రంలోని 'నాటు నాటు' అనే సాంగ్ రిలీజ్ చేశారు. Ram Charan, NTR కలసి డాన్స్ చేయబోతున్న ఈ సాంగ్ పై ఫ్యాన్స్ లో భారీ ఆశలు ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే విడుదలైన ఈ పాట అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంది. లిరికల్ వీడియోలో ఎన్టీఆర్, చరణ్ డాన్స్ మూవ్స్ కూడా కొన్ని చూపించారు. చరణ్, ఎన్టీఆర్ ఫుల్ ఎనర్జిటిక్ గా స్టెప్పులేస్తున్నారు. ఎన్టీఆర్, చరణ్ డాన్స్ చేస్తుంటే వారిని చూస్తూ బ్రిటిష్ వనితలు మైమరచిపోతున్నారు. 

పాట వింటుంటే వారితో పాటు మనం కూడా డాన్స్ చేయాలనిపించే విధంగా 'నాటు నాటు' సాంగ్ అదిరిపోయే బీట్ తో సాగుతోంది. ఈ లిరికల్ వీడియోలో ఎన్టీఆర్ కి జోడిగా నటిస్తున్న ఇంగ్లీష్ నటి ఒలీవియా మోరిస్ ని కూడా చూపిస్తున్నారు. దుమ్ములేచిపోయే విధంగా ఎన్టీఆర్, రాంచరణ్ స్టెప్పులు ఈ సాంగ్ లో ఉండబోతున్నాయి. 

ఇక సాంగ్ గురించి మాట్లాడుకుంటే.. అసలు సిసలైన తెలుగు పదాలతో చంద్రబోస్ ఈ సాంగ్ కు అద్భుతమైన సాహిత్యం అందించారు. సాంగ్ తొలి సెకండ్ నుంచి లాస్ట్ సెకండ్ వరకు బీట్ లో ఊపు తగ్గకుండా ఉండేలా కీరవాణి సంగీతం అందించారు. ఈ పాటని కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఫుల్ జోష్ తో పాడారు. 

Also Read: గుండు కొట్టించుకునేందుకు రెడీ.. అనసూయ షాకింగ్ కామెంట్స్

పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్లు, పోలేరమ్మ జాతరలో పోతురాజు ఊగినట్లు అంటూ చంద్రబోస్ మాస్ లిరిక్స్ అందించారు. ఇక ఈ సాంగ్ పై సోషల్ మీడియాలో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ మారు వేషాల్లో బ్రిటిష్ కోటలోకి ప్రవేశించి ఆటపాటలతో వారిని మైమరపిస్తారట. అలా కోటలోపల రహస్యాలు తీసుకుంటారని టాక్. జక్కన్న సినిమా అంటే ఇలాంటి సుర్ ప్రైజ్ లు చాలానే ఉంటాయి మరి. ఆలస్యం చేయకుండా నాటు నాటు సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి. 

 

PREV
click me!

Recommended Stories

సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్