బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ’. విజయవంతమైన ‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిది.
‘‘ధం ధం ధర్మభేరి శబ్ధం చెయ్యమంది యుద్ధం దేనికైనా సిద్ధం...’’ అంటూ సాగే బాలకృష్ణ ‘అఖండ’ గర్జన తో ఫ్యాన్స్ ఓ ప్రక్క ఊగిపోతున్నారు. ఈ లోగా ఈ చిత్రం రిలీజ్ డేట్ బయిటకు వచ్చింది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై కన్ఫూజన్ నడుస్తోంది. అయితే మొత్తానికి క్లారిటీ వచ్చింది. డిసెంబర్ లో సినిమా రిలీజ్ కానుంది. డేట్ కూడా ఖరారు చేసారు.
బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ’. విజయవంతమైన ‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిది. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైనవీడియోలో బాలకృష్ణ అఘోర పాత్రలో సందడి చేశారు. ఆయన ఇందులో రెండు రకాల పాత్రల్లో కనిపించనున్నారు .ఈ చిత్రాన్ని డిసెంబర్ 2 వ తేదీన రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. యుస్ లో డిసెంబర్ 1 రాత్రి ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే అఫీషియల్ ప్రకటన ఏమీ రాలేదు.
ప్రస్తుతం పోస్ట్ పొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. రిలీజ్ డేట్ ఫిక్స్ అవటంతో ఈ జోరు రెట్టింపు అయ్యింది. ఇక ఇప్పటికే చూసిన వారు ..చూస్తుంటే ‘అఖండ’సంక్రాంతి సినిమాలు వచ్చేదాకా ఆడటం ఖాయమని అంటున్నారు. బాలకృష్ణ - బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది. విజయవంతమైన ‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అభిమానులు మరింత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఆయనకి జోడీగా ప్రగ్యా జైశ్వాల్, పూర్ణ నటించారు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత.