ప్రభాస్, రానాతో రవీనా ఫుల్ ఎంజాయ్..ఫోటోలు వైరల్

Published : Oct 03, 2017, 04:14 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
ప్రభాస్, రానాతో రవీనా ఫుల్ ఎంజాయ్..ఫోటోలు వైరల్

సారాంశం

బాహుహలి చిత్రంతో బాలీవుడ్ లోనూ క్రేజ్ సంపాదించిన ప్రభాస్, రానా, అనుష్క తాజాగా దసరా రోజున హైదరాబాద్ లో ఓ పార్టీలో బాహుబలి టీమ్ తో కలిసి రవీనా రవీనాతో ఎంజాయ్ చేసిన అనుష్క, ప్రబాస్, రానా, గిఫ్ట్ గా బాహుబలి కత్తి ఇచ్చిన రవీనా

తెలుగులో నాగార్జున, మోహాన్ బాబు, బాలకృష్ణ లాంటి హీరోల సరసన నటించిన బాలీవుడ్ అలనాటి అందాల తార రవీనాటాండన్ రీసెంట్ గా బాహుబలి హీరోలు ప్రభాస్, రానా దగ్గుబాటితో దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దసరా రోజున హైదరాబాద్ లో జరిగిన ఓ పార్టీలో ప్రభాస్, రానా, అనుష్క, రవీనా టాండన్ కలుసుకున్నారు.

 

పార్టీలో సరదాగా ఎంజాయ్ చేసిన బాహుబలి టీమ్,రవీనా అంతా కలిసి సెల్ఫీ దిగారు. ఆ ఫోటోను రవీనా తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసింది. తను షేర్ చేసిన కొన్ని గంటల్లోనే ఆ ఫోటో వైరల్‌గా మారింది. ఈ పార్టీ సందర్భంగా బాహుబలితో జాతీయ స్థాయి ప్రజాదరణను పొందిన ప్రభాస్, అనుష్కకు రవీనా టాండన్ కత్తిని బహుకరించింది.

 

ఈ పార్టీలో బాహుబలి నటీనటులతో రవీనా చాలా సమయాన్ని గడిపినట్టు తెలుస్తున్నది. అయితే ఈ పార్టీ ఎక్కడ, ఎందుకు జరిగిందనే విషయంపై వివరాలు అందుబాటులోకి రాలేదు. బాహుబలి సృష్టించిన ప్రభంజనంతో నేషనల్ లెవెల్లో ప్రభాస్, రానా, అనుష్కకు మంచి పేరొచ్చింది. వీళ్ల నటనకు బాలీవుడ్ కూడా ఫిదా కావడం విశేషం.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌