మెగా కోడలికి చిరంజీవి సైరా నిర్మాణ బాధ్యతలు

First Published Oct 3, 2017, 3:51 AM IST
Highlights
  • నిర్మాతగా మారనున్న మెగా కోడలు ఉపాసన
  • సైరా నరసింహారెడ్డి నిర్మాణ బాధ్యతలు ఉపాసనకే
  • రామ్ చరణ్ రంగస్థలం బిజీ కారణంగా నిర్మాతగా మారిన మెగాకోడలు

మెగా కోడలు ఉపాసన నిర్మాతగా మారనుందా..? చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం సైరా నిర్మాత బాధ్యతల నుంచి రామ్ చరణ్ తప్పుకోనున్నాడా? ఇక సైరా నిర్మాణ బాధ్యతలు మెగా కోడలివేనా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. ఇప్పటికే సైరా షూటింగ్ అక్టోబర్ లో ప్రారంభిస్తామని ప్లాన్ చేసుకున్న టీమ్ భారీ సెట్స్ వేసి షూటింగ్ కు రెడీ అవుతోంది. అయితే నిర్మాత రామ్ చరణ్ ప్రస్థుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలం సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా వున్నారు. దీంతో సైరా మరింత ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతోనే నిర్మాణ బాధ్యతలు ఉపాసనకు అప్పగించాలని భావిస్తున్నారట.

 

తెలుగు, హిందీ భాషలతోపాటు పలు లాంగ్వేజ్‌లలో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకొంటున్న సైరా నర్సింహారెడ్డి చిత్రం షూటింగ్ కోసం మెగాస్టార్ అన్ని విధాలుగా సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్‌లోనే షూటింగ్‌కు వెళ్లాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల అక్టోబర్‌కు మార్చారు. అయితే రామ్ చరణ్ రంగస్థలం షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల మెగా కోడలు ఉపాసనకు నిర్మాణ బాధ్యతలను అప్పగించినట్టు సమాచారం.

ఉపాసన బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఆమెకు వ్యాపార నిర్వాహణ సామర్థ్యం ఉంది. అపోలో హాస్పిటల్, రాంచరణ్ ట్రూ జెట్ ఎయిర్ లైన్స్ కి సంబంధించి వ్యవహారాలను ఉపాసన చూస్తున్నది. ప్రస్తుతం సినిమా నిర్మాణ బాధ్యతలను కూడా తీసుకోనున్నట్టు సమాచారం. సైరాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, విజయ్ సేతుపతి, నయనతార, ప్రగ్యా జైస్వాల్ తదితరులు ఉన్నారు. ఇలాంటి ప్రాముఖ్యత ఉన్న చిత్రానికి నిర్మాణ సారథ్యం వహించే అవకాశం ఉపాసనకు రావడం నిజంగా అదృష్టమే.

 

ఉపాసన టాలెంట్‌కు టెస్ట్ మెగా కాంపౌండ్‌లో ఇప్పటికే నాగబాబు, అల్లు అరవింద్, పవన్ కళ్యాణ్, రాంచరణ్ నిర్మాతలుగా తమ సత్తాని చాటుకుంటున్నారు. ఇప్పుడు మెగా కోడలు ఉపాసన కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం గమనార్హం. సైరా నిర్మాణ బాధ్యతలను ఉపాసన ఎంతమేరకు సక్సెస్ ఫుల్ గా నిర్వర్తించగలదో వేచి చూడాల్సిందే.

 

click me!