ఈ బాలీవుడ్ భామ చాలా మందితో డేటింగ్ చేసిందట..

Published : Oct 03, 2017, 02:26 AM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
ఈ బాలీవుడ్ భామ చాలా మందితో డేటింగ్ చేసిందట..

సారాంశం

బాలీవుడ్ లో ఇటీవల సెన్సేషనల్ కమెంట్స్ తో ఆకట్టుకుంటున్న భూమి పడ్నేకర్ తాజాగా తాను ఎంతో మందితో డేటింగ్ చేశానంటున్న భూమి అయితే అదంతా బాలీవుడ్ కు రాకముందేనట  

బాలీవుడ్ హీరోయిన్లు వార్తల్లో ఉండేందుకు రకరకాల గిమ్మిక్కులు చేస్తుంటారు. ఫోటో షూట్లతో, వివాదాస్పద కమెంట్లతో... స్కిన్ షోలతో రకరకాలుగా తమవైపు దృష్టి మరల్చేలా ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఈ లిస్ట్ లో మరో బాలీవుడ్ బ్యూటీ చేరింది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా తెరకెక్కిన దమ్ లగాకే హైస్సా సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అయిన బ్యూటీ భూమీ పెడ్నేకర్.

 

తొలి సినిమాలో భారీకాయంతో కనిపించిన ఈ భామ తరువాత స్లిమ్ లుక్ లోకి మారిపోయిన హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకునే పనిలో ఉంది. అయితే బాలీవుడ్ కాంపిటీషన్ లో ఉండేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది భూమి. తాను మోడ్రన్ యువతినన్న భూమి, బాలీవుడ్ కి పరిచయం కాకముందు చాలా మందితో డేటింగ్ చేశానని తెలిపింది.

 

అంతేకాదు తాను ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలబడేందుకు ప్రయత్నం చేస్తున్నాని, ఇంత వరకు ఏ హీరోతోనూ వరుస సినిమాలు చేయలేదు హీరోలతో ఎఫైర్స్ ఉన్నాయంటూ వస్తున్న వార్తలని అబద్ధమని కొట్టిపడేసింది. ప్రస్తుతానికి తనూ తన వృత్తినే పెళ్లి చేసుకున్నానన్న భూమి పెడ్నేకర్, ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని తేల్చి చెప్పింది.

PREV
click me!

Recommended Stories

అందుకే పవన్ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
'మన శంకర వరప్రసాద్ గారు' సెన్సార్ రివ్యూపై నిర్మాత కామెంట్స్..ఆ సినిమాల వల్లే థియేటర్ల సమస్య