మానవ జాతి తుడిచి పెట్టుకుపోయే సమయం.. రష్మీ ఎమోషనల్ ట్వీట్, ఆ వీడియో చూస్తే

pratap reddy   | Asianet News
Published : Oct 04, 2021, 03:07 PM ISTUpdated : Oct 04, 2021, 05:07 PM IST
మానవ జాతి తుడిచి పెట్టుకుపోయే సమయం.. రష్మీ ఎమోషనల్ ట్వీట్, ఆ వీడియో చూస్తే

సారాంశం

జబర్దస్త్ షో తో క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. బుల్లితెరపై రష్మీ యాంకరింగ్.. సుధీర్ తో కలసి పండించే కెమిస్ట్రీ ఇవంతా రష్మీకి ఒకవైపు మాత్రమే. ఆమెలో మరో కోణం కూడా దాగి ఉంది.

జబర్దస్త్ షో తో క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. బుల్లితెరపై రష్మీ యాంకరింగ్.. సుధీర్ తో కలసి పండించే కెమిస్ట్రీ ఇవంతా రష్మీకి ఒకవైపు మాత్రమే. ఆమెలో మరో కోణం కూడా దాగి ఉంది. రష్మీ జంతు ప్రేమికురాలు. చాలా సందర్భాల్లో రష్మీ జంతువులపై తన ప్రేమ చాటుకుంది. 

లాక్ డౌన్ టైంలో ఫుడ్ లేక అల్లాడుతున్న జంతువులకు రష్మీ స్వయంగా ఆహారం అందించింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. జంతువులపై హింసాయుత సంఘటనలు ఏమైనా జరిగితే రష్మీ వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తుంది. 

Also Read: చిరంజీవి అలా చేస్తే విష్ణుని తప్పుకోమని చెబుతా.. 'మా' ఎలక్షన్ పై మోహబ్ బాబు

తాజాగా రష్మీ ఎమోషనల్ ట్వీట్ చేసింది. మధ్యప్రదేశ్ దేవాస్ నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు ఓ శునకంపై అతి దారుణంగా ప్రవర్తించారు. కుక్కని కర్రలతో బాదుతూ చంపేశారు. ఆ వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. 

హృదయ విదారకంగా ఉన్న ఈ ఘటనపై ప్రతి ఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూగ జంతువు పట్ల అంత అమానుషంగా ప్రవర్తించిన వారిని శిక్షించాలని కోరుతున్నారు. ఈ ఘటనపై రష్మీ ట్వీట్ చేస్తూ.. 'మానవత్వం లేనివారు చూస్తూ ఉండిపోయారు. మానవజాతి తడిచిపెట్టుకునిపోయే సమయం వచ్చింది. మనకు ఇక్కడ జీవించే హక్కు లేదు ' అంటూ రష్మీ ట్వీట్ చేసింది.

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌