ఆ గొడవ ఏమిటో వాళ్లిదరికే తెలుసు.. సమంత, చైతు విడాకులపై కుష్బూ కామెంట్

Published : Oct 04, 2021, 02:59 PM IST
ఆ గొడవ ఏమిటో వాళ్లిదరికే తెలుసు.. సమంత, చైతు విడాకులపై కుష్బూ కామెంట్

సారాంశం

సమంత(Samantha) , చైతు విడాకుల విషయంపై సీనియర్ హీరోయిన్ కుష్బూ(kushboo) స్పందించారు. ఆమె సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయం తెలియజేశారు. 

సమంత-చైతు విడాకుల వార్త టాలీవుడ్ ని కుదిపివేసింది. బెస్ట్ కపుల్ గా పేరున్న ఈ జంట విడిపోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇక వీరి విడాకుల వెనుక కారణాలేంటని వెతికే పనిలో పడ్డారు జనాలు. ప్రధానంగా సమంత పర్సనల్ డిజైనర్ గా పని చేస్తున్న జుల్కర్ కారణంగా విడిపోయారనేది ప్రధానంగా వినిపిస్తుంది. ఈ రూమర్స్ కి పరోక్షంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేసిన జుల్కర్, సోషల్ మీడియా పోస్ట్ చేసి, తరువాత డిలీట్ చేశారు. 


ఇక సమంత , చైతు విడాకుల విషయంపై సీనియర్ హీరోయిన్ కుష్బూ స్పందించారు. ఆమె సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయం తెలియజేశారు. భార్యా భర్తల మధ్య జరిగే విషయాలు వాళ్లకు మాత్రమే తెలుస్తాయని అనవసరమైన రూమర్స్ సృష్టించవద్దని ఆమె కోరుకున్నారు.

కుష్బూ తన ట్వీట్ లో 'భార్య భర్తల మధ్య ఏం జరిగిందనేది వాళ్లిద్దరికి తప్పా మరెవరికి తెలియదు. వాళ్లు విడిపోవడానికి గల కారణాలు ఎవరికి తెలియదు. వాళ్ల ప్రైవసీని అందరం గౌరవించాలి. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి వాళ్లకు కాస్త సమయం ఇవ్వాలి. అప్పటి వరకు ఈ విషయంపై అనవరసరమైన ఊహాగానాలు, రూమర్స్‌ సృష్టించవద్దు' అని కోరారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌
రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?