`ఇది నా ల‌వ్‌స్టోరి` రెండో సాంగ్‌ ఆవిష్క‌రించిన‌ రానా దగ్గుబాటి

Published : Jul 08, 2017, 05:49 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
`ఇది నా ల‌వ్‌స్టోరి` రెండో సాంగ్‌ ఆవిష్క‌రించిన‌ రానా దగ్గుబాటి

సారాంశం

చాలా గ్యాప్ తర్వాత తరుణ్ హీరోగా తెరకెక్కిన ఇది నా లవ్ స్టోరీ ఈ చిత్రం రెండో పాటను విడుదల చేసిన రానా దగ్గుబాటి ఇది నా ల‌వ్‌స్టోరి` సాంగ్స్‌కి డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో అద్భుత స్పంద‌న‌

ల‌వ‌ర్‌బోయ్ త‌రుణ్ ఈజ్ బ్యాక్‌.  ప్ర‌స్తుతం ఈ యువ‌హీరో `ఇదీ నా ల‌వ్‌స్టోరి` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రించేందుకు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే పోస్ట‌ర్లు ఆక‌ట్టుకున్నాయి. టీజ‌ర్‌, రెండు పాట‌ల‌తో మూవీపై అంచ‌నాలు పెరిగాయి. ఇక ఇదివ‌ర‌కే రిలీజైన తొలి సాంగ్‌కి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. చ‌క్క‌ని మెలోడీతో ఆక‌ట్టుకుంద‌న్న ప్ర‌శంస‌లొచ్చాయి.  లేటెస్టుగా ఈ సినిమా నుంచి రెండో సాంగ్ ను భ‌ళ్లాల దేవ రానా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ద‌ర్శ‌క‌నిర్మాత‌లు, హీరో త‌రుణ్ ... రానాకు ప్ర‌త్యేకించి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 

 

ద‌ర్శ‌క‌నిర్మాత‌లు మాట్లాడుతూ ``ఈ వెయిటింగ్ ఇంకెంత సేపు.... ఐ మిస్ యు నిన్నెంత‌గానో..... ఐ ల‌వ్ యు చెప్పాలి నీతో రావా చెంత‌కి....`` అంటూ సాగే  పాట‌ను రానా లాంచ్ చేశారు. ఈ పాట‌కు శ్రోత‌ల నుంచి చ‌క్క‌ని రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ పాట‌లో గెడ్డంతో త‌రుణ్ కొత్త లుక్ ఆక‌ట్టుకుంటోంది. క‌థానాయిక ఓవియా రొమాన్స్ సంథింగ్ స్పెష‌ల్‌గా ఉంద‌న్న టాక్ వ‌చ్చింది. రిలీజైన రెండు పాట‌లు ఒక‌దానికొక‌టి భిన్నంగా ఉన్నాయ‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇక తాజాగా రిలీజైన పాట‌లో ఎగ్జోటిక్ బీచ్ లొకేష‌న్స్ అద్భుతం అన్న ప్ర‌శంస‌లొస్తున్నాయి`` అని తెలిపారు. 

 

`ఇది నా లవ్‌స్టోరి` ఓ చ‌క్క‌ని రొమాంటిక్ కామిడీ ఎంటర్‌టైన‌ర్‌. తరుణ్ స‌ర‌స‌న ఈ చిత్రంలో ఓవియ హెలెన్ క‌థానాయిక‌గా న‌టించారు. రమేష్ గోపి ద‌ర్శ‌క‌త్వంలో ఎస్.వి. ప్రకాష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీనాథ్ విజయ్ అందించిన స్వ‌రాలు రీఫ్రెషింగ్ అన్న టాక్ వ‌స్తోంది. పాటలు పెద్ద స‌క్సెస‌య్యాయి. త్వ‌ర‌లోనే రిలీజ్‌కి వ‌స్తున్న ఈ సినిమా అంత‌కుమించి ఘ‌న‌విజయం సాధిస్తుంద‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?
Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ డిసెంబర్ 16 బాలుని సవతి తల్లిలా చూశాను... ప్రభావతిలో మొదలైన పశ్ఛాత్తాపం