సన్నీ, రానా దగ్గరయ్యారు-ఫుట్సల్

Published : Sep 12, 2017, 04:30 PM ISTUpdated : Mar 25, 2018, 11:48 PM IST
సన్నీ, రానా దగ్గరయ్యారు-ఫుట్సల్

సారాంశం

రానా సన్నీలు ఒకే స్పోర్ట్ ప్రమోషన్ లో.. ఫుట్సల్ గేమ్ ప్రమోటర్స్ గా రానా, సన్నీ చెరో జట్టును ప్రమోట్ చేస్తున్న రానా, సన్నీ

వరుసగా సక్సెస్ లు సాధిస్తూ మాంచి ఫామ్ లో వున్న రానా దగ్గుబాటి.., బాలీవుడ్ లోటాప్ ఐటమ్ బాంబ్ గా దూసుకెళ్తున్న సన్నీ లియోనీ ఇప్పుడు దగ్గరయ్యారు. ఇంతకీ విషయమేంటంటే.. రానా దగ్గుబాటి, సన్నిలియోన్ ఫుట్సల్ అనే ఫుట్‌బాల్ క్రీడను ప్రమోట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

 

ఇండియాలో క్రికెట్,టెన్నిస్, హాకీ, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, చెస్ లాంటి ఎన్నో ఆటలకి ప్రాముఖ్యత వుంది కానీ ఫుట్సల్ అనే క్రీడ గురించి మాత్రం చాలామందికి తెలిసి వుండదు. గతేడాదే మొదటిసారిగా ఇండియన్ ఫుట్సల్ లీగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడదే ప్రీమియర్ ఫుట్సల్ సెకండ్ ఎడిషన్ సెప్టెబర్ 15 నుంచి ప్రారంభం కానుంది.

ఈ ప్రీమియర్‌లో పాల్గొంటున్న తెలుగు టైగర్స్ జట్టుని రానా దగ్గుబాటి ప్రమోట్ చేస్తుండగా కేరళ జట్టు ఫ్రాంచైజీ కేరళ కోబ్రాస్ టీమ్‌కి సన్నిలియోన్ కో-ఓనర్‌గా వ్యవహరిస్తుండటంతోపాటు ఆ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గానూ కనిపించనుంది.

 

ఇదిలావుంటే, బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ ముంబై జట్టుకి కో-ఓనర్‌గా వున్నాడు. ముంబై, బెంగుళూరు నగరాల్లో జరగనున్న ఈ సెకండ్ ఎడిషన్‌ని ఈ స్టార్స్ ఎంతమేరకు రక్తి కట్టిస్తారో చూడాలి మరి.

PREV
click me!

Recommended Stories

Kokkoroko మూవీతో అలరించేందుకు వస్తోన్న యంగ్‌ సెన్సేషన్‌.. కొత్త పోస్టర్‌ అదిరింది
Dhoolpet Police Station Review: `ధూల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌` కేస్‌ 1 వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. చూపు తిప్పుకోలేరు